ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తీరథ్ సింగ్ రావత్
Send us your feedback to audioarticles@vaarta.com
ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తీరథ్ సింగ్ రావత్ నియమితులయ్యారు. ఉత్తరాఖండ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. కాగా.. సొంత పార్టీ నేతల అసమ్మతి కారణంగా సీఎంగా త్రివేంద్ర సింగ్ రావత్ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో బీజేపీ ఎంపీ తీరథ్ సింగ్ రావత్ సీఎం పగ్గాలు చేపట్టనున్నారు. ఆయన్ను సీఎంగా ఎన్నుకుంటూ పార్టీ వర్గాలు బుధవారం నిర్ణయం తీసుకున్నాయి. అంతకు ముందు సీఎం రేసులో ఎమ్మెల్యే ధన్ సింగ్ రావత్‌తో పాటు కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియల్ పేర్లు వినిపించాయి. కానీ పార్టీ మాత్రం తీరథ్ వైపే మొగ్గు చూపింది.
ఉత్తరాఖండ్ తొమ్మిదవ ముఖ్యమంత్రిగా తీరథ్ సింగ్ రావత్ బాధ్యతలు చేపట్టనున్నారు. 56 ఏళ్ల తీరథ్ సింగ్ రావత్.. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2013-15 మధ్య ఉత్తరాఖండ్‌లో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. గతంలో రాష్ట్ర ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. మంగళవారం డెహ్రాడూన్‌లో పార్టీ లెజిస్లేచర్ మీటింగ్‌లో పాల్గొన్న బీజేపీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. పనితీరు సరిగా లేని కారణంగా రాష్ట్రంలో నాయకత్వాన్ని మార్చాలనే డిమాండ్లు రావడంతో మాజీ సీఎం త్రివేండ్ర సింగ్ రావత్ తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout