'తిప్పరామీసం' సినిమాను అమ్మలందరికీ అంకితం ఇస్తున్నాను: శ్రీవిష్ణు
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి హీరో హీరోయిన్లుగా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కృష్ణ విజయ్ L ప్రొడక్షన్స్ మరియు శ్రీ ఓం సినిమా బ్యానర్స్‌పై రిజ్వాన్ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `తిప్పరామీసం`. ఈ సినిమా నవంబర్ 8న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ..
వి.వి.వినాయక్ మాట్లాడుతూ - ``ఈ చిత్ర నిర్మాత రిజ్వాన్‌గారికి, నా మిత్రుడు వెన్నెల రామారావు, నిర్మాత విజయ్‌గారికి డబ్బు, మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. శ్రీవిష్ణు.. ఆడియెన్స్‌లో, ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. చిన్న క్యారెక్టర్స్ చేస్తూ హీరో అయ్యారని ఎప్పుడో విన్నాం. ఈ జనరేషన్లో అలాంటి మాట వినలేదు. ఒక శ్రీవిష్ణుగారికే సాధ్యమైంది. కథను ఫర్ఫెక్ట్గా ఎంచుకునే హీరో ఆయన. డైరెక్టర్‌తో పాటు ఇన్వాల్వ్ అయ్యి మంచి ప్రొడక్ట్ వచ్చేలా చూసుకుంటాడు శ్రీవిష్ణు. ఇకపై కూడా తను అలాంటి మంచి సినిమాలనే చేయాలని కోరుకుంటున్నాను. ఎంటైర్ యూనిట్‌కి అభినందనలు`` అన్నారు.
హీరో నారా రోహిత్ మాట్లాడుతూ - ``ఈ సినిమాకు పనిచేసిన టీమ్‌తో ఇది వరకే నేను పనిచేశాను. కృష్ణ విజయ్‌తో నేను అసుర సినిమా చేశాను. విష్ణు నాకు మంచి స్నేహితుడు. సినిమా చాలా పెద్ద హిట్ కావాలి. నేను సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. సినిమా పెద్ద హిట్ అయ్యి విష్ణు మరిన్ని మంచి సినిమాలు చేయాలని, డైరెక్టర్ కృష్ణ విజయ్ పెద్ద డైరెక్టర్‌గా ఎదగాలని కోరుకుంటున్నాను. నవంబర్ 8న సినిమా విడుదలవుతుంది`` అన్నారు.
హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ - ``నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలో నా డైరెక్టర్స్ అందరూ ఫెయిల్యూర్ క్యారెక్టర్‌గా చూపించారు. అప్పట్లో ఒకడుండేవాడు, నీదినాది ఒకే కథ, మెంటల్ మదిలో సినిమాలన్నింటిలో నా పాత్రలు ఇలాగే ఉంటాయి. ఇక కృష్ణ విజయ్ విషయానికి వస్తే.. నాకు తను చాలా మంచి మిత్రుడు. నా గురించి బాగా తెలిసిన వ్యక్తి. సూపర్ క్యారెక్టర్ ఇస్తాడేమో అని అనుకున్నాను. తీరా చూస్తే నెగటివ్ క్యారెక్టర్ కథ చెప్పాడు. కథ బాగా నచ్చింది. నా పక్క నుండి నాలో ఈ యాంగిల్‌ను చూశారా? అనిపించింది. ఈ పాత్రకు మీరు సూట్ అయ్యారు మీకు నచ్చినట్లు చేయండని నాతో అన్నారు. ఏంట్రా ఇలా అంటున్నారే అని అనుకున్నాను. చివరకు సినిమా చూసుకున్న తర్వాత నాకు అర్థమైంది. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రపంచంలో, జీవితంలో అన్ని మారుతుంటాయి. కానీ పిల్లలపై అమ్మ చూపించే ప్రేమ ఎప్పటికీ మారదు. అమ్మ ప్రేమపై సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. అలాంటి ఓ అమ్మ ప్రేను చూపించే సినిమాలో నటించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా జీవితంలో గొప్ప సినిమాగా భావిస్తున్నాను. ఈ సినిమాలో రోహిణిగారు మా అమ్మ పాత్రలో నటించారు. ప్రతి సినిమాకు సాధారణంగా పాత్ర పరంగా ప్రిపేర్ అవుతుంటాను. కానీ సినిమాలో అలాంటి ప్రిపరేషన్ ఏదీ లేకుండా నటించాను. ఆమ్మ పాత్రను రోహిణిగారు చేయడం గొప్పగా అనిపించింది. సినిమా అందరూ చూసేలా ఉంటుంది. ఓ గొప్ప ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే సినిమా అవుతుందని ప్రామిస్ చేయగలను. మన అమ్మలందరికీ మా `తిప్పరామీసం` చిత్రాన్ని డేడికేట్ చేస్తున్నాను. సిద్, షర్మిల, శాండీ, వినయ్ మంచి సపోర్ట్‌ను అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతాన్ని అందించాడు. ఎడిటర్ ధర్మేంద్రగారు సినిమాకు చాలా మంచి వర్క్ అందించారు. మా నిర్మాతలు కృష్ణ విజయ్, రిజ్వాన్‌గారికి థ్యాంక్స్. పెద్ద నిర్మాతలైన సురేష్‌బాబు, సునీల్‌గారు కొత్త కాన్సెప్ట్ సినిమాలను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. కొత్త కాన్సెప్ట్‌లతో వచ్చేవారందరూ ఇప్పుడు మీసం తిప్పే టైమ్ ఇది. అందరికీ థ్యాంక్స్`` అన్నారు.
ఈ కార్యక్రమంలో రవివర్మ, రవి ప్రకాష్, నవీన్, జేమ్స్, బెనర్జీ, నిక్కీ తంబోలి తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout