Times Now Survey: టైమ్స్‌నౌ సర్వేలో వైసీపీ ప్రభంజనం.. ఫ్యాన్ గాలికి టీడీపీ హుష్ కాకి..
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందని టైమ్స్ నౌ నవజీవన్, ఈటీజీ సర్వేలో తేలింది. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఈ సర్వేలో వెల్లడైంది. ఫ్యాన్ పార్టీ 24 లేదా 25 సీట్లను సొంతం చేసుకుంటుందని పేర్కొంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఒక్క సీటు రావొచ్చని లేదా అది కూడా గెలిచే అవకాశం లేదని తెలిపింది. జనసేన, బీజేపీలు అయితే ఖాతా కూడా తెరవలేవని ప్రకటించింది. ఇక ఓట్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే 50 శాతం ఓట్లతో వైసీపీ ప్రభంజనం సృష్టించనుందని వెల్లడైంది.
తెలుగుదేశం పార్టీకి 37శాతం, జనసేనకు 10 శాతం ఓట్లు పడతాయని అంచనా వేసింది. ఈ సర్వే ప్రకారం చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒక్కో లోక్‌సభ పరిధిలో సగటున ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 24 ఎంపీ సీట్లు గెలిచే అవకాశాలున్నాయని ఈ సర్వే చెప్పిన దాని ప్రకారం వైసీపీ ఏకంగా 168 స్థానాల్లో విజయదుందుభి మోగించనుందని అర్థమవుతోంది.
ఇక తెలంగాణ విషయానికొస్తే 17 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 8-10 స్థానాలు గెలవొచ్చని పేర్కొంది. బీఆర్ఎస్ 3-5 స్థానాలు, బీజేపీ 3-5 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్ 37 శాతం ఓట్లు, బీఆర్ఎస్ 32 శాతం, బీజేపీ 24 శాతం ఓట్లు సాధిస్తాయని సర్వేలో తేలింది.
మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న 543 పార్లమెంట్ స్థానాల్లో ఎన్డీఏ కూటమికి ఏకంగా 323 సీట్లొస్తాయని అంచనా వేసింది. విపక్ష ఇండియా కూటమి కేవలం 163 సీట్లకే పరిమితమవుతుందని వెల్లడించింది. కూటమితో పని లేకుండా బీజేపీ ఒక్కటే పోటీ చేస్తే 308 నుంచి 328 వరకు స్థానాలు వచ్చే అవకాశముందని సర్వే వివరించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఆ పార్టీ దాదాపుగా క్లీన్‌స్వీప్ చేస్తుందని తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com