Tillu Square:బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న 'టిల్లు'గాడు.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'టిల్లు స్క్వేర్' బ్లాక్బాస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. మరోసారి టిల్లు గాడి మ్యాజిక్ దెబ్బకు థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. దీంతో అందరూ ఊహించిన దాని కంటే ఎక్కువ వసూళ్లు రాబడుతున్నాడు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. తొలిరోజే రూ.23.7కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఔరా అనిపించింది. అమెరికాలో కూడా మొదటి రోజే 1 మిలియన్ డాలర్స్ పైగా కలెక్ట్ చేసింది. మీడియం రేంజ్ హీరోలను మించి ఓపెనింగ్స్ రాబట్టాడు సిద్ధు.
టిల్లు గాడి హవా చూస్తుంటే వీకెండ్లోనే రూ.50కోట్లు వసూళ్లు రాబట్టేలా ఉంది. అలాగే లాంగ్‌రన్‌లో రూ.100కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నిర్మించిన 'టిల్లు స్క్వేర్' సినిమా 'డీజే టిల్లు' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ గ్లామర్‌తో అదరగొట్టగా.. టిల్లు పాత్రలో చెప్పిన ఒన్ లైనర్స్, రిఫరెన్స్‌లు థియేటర్లో గట్టిగా పేలాయి. తనదైన డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు.
అలాగే డీజే టిల్లులో నటించిన రాధిక పాత్ర మళ్లీ ఎంటర్ అవ్వడం కూడా ప్రేక్షకులను అలరించింది. ఇక అనుపమ-సిద్ధు లిప్‌లాక్‌లు, రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయారు. ఇక భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. రామ్ మిరియాల, అచ్చు రాజమణి ఇచ్చిన మ్యూజిక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ఈ సమ్మర్లో అదిరిపోయే హిట్‌తో టిల్లు గాడు థియేటర్లను షేక్ చేస్తు్న్నాడు. మరోవైపు ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. రూ.13 కోట్ల నుంచి రూ.15 కోట్ల మధ్యలో అమ్ముడుపోయినట్లు టాక్ నడుస్తోంది. ఇక శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానల్ దక్కించుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com