విజయవంతంగా మూడోవారంలో అడుగిడిన 'టిక్ టిక్ టిక్'

  • IndiaGlitz, [Saturday,July 07 2018]

ఈమధ్యకాలంలో స్ట్రయిట్ సినిమాలే రెండు వారాలపాటు థియేటర్లలో ప్రదర్శితమవ్వడానికి నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఒక డబ్బింగ్ సినిమాగా విడుదలైన టిక్ టిక్ టిక్ కమర్షియల్ సినిమా కాకపోయినా.. మాస్ ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేసే స్పెషల్ సాంగ్స్, ఫైట్స్ ఏమీ లేకపోయినా.. కంటెంట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటూ మూడోవారంలోకి అడుగిడింది. జయంరవి-నివేతా పెతురాజ్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం తమిళ-తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల కాగా రెండు చోట్ల సూపర్ హిట్ టాక్ తో ప్రేక్షకుల్ని అలరిస్తూ నేటితో మూడోవారంలోకి అడుగిడింది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చదలవాడ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారుతోంది. కమర్షియల్ అంశాలకంటే కంటెంట్ కి ఎక్కువ వేల్యూ ఇస్తున్నారు. అందుకే మా టిక్ టిక్ టిక్ను విశేషమైన రీతిలో ఆదరిస్తూ మంచి విజయాన్ని అందించారు. పెద్దలతోపాటు పిల్లలు కూడా మా చిత్రాన్ని ఆదరిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. మేం ఉహించినదానికంటే భారీ స్థాయిలో కలెక్షన్స్ ఉన్నాయి. ఇదే తరహాలో వైవిధ్యమైన చిత్రాలు మా సంస్థ నుంచి వస్తూనే ఉంటాయి. ప్రేక్షకులకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో మాత్రమే చూడాలని కోరుకొంటున్నాము.

More News

ఈ దేవ‌దాస్‌ కూడా అంతేన‌ట‌

దేవ‌దాసు.. తెలుగు తెర‌పై నాలుగు సార్లు వినిపించిన టైటిల్ ఇది.

డిఫ‌రెంట్ చిత్రాల ద‌ర్శ‌కుడితో నాని?

ఐతే, అనుకోకుండా ఒక రోజు, ఒక్క‌డున్నాడు, ప్ర‌యాణం, సాహసం, మ‌న‌మంతా .. ఇలా వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌తో తెలుగు ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ర్షించిన ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి.

అర‌వింద స‌మేత‌.. టీజ‌ర్‌, ఆడియో ఫంక్ష‌న్ వివ‌రాలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న‌ చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'.

అక్కినేని ఫ్యామిలీకి కలిసొచ్చిన స్క్రీన్ నేమ్‌తో చైతు?

'ప్రేమ్‌నగర్', 'అల్లరి అల్లుడు'..  అక్కినేని ఫ్యామిలీకి ఘన విజయాన్ని అందించిన ఈ రెండు సినిమాల్లో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే..

నిర్వాణ సినిమాస్ విడుదల చెయ్యనున్న 'మను'

నటుడు బ్రహ్మానందం కుమారుడు గౌతమ్, చాందిని చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన 'మను' సినిమా ప్రముఖ యు.ఎస్ డిస్ట్రిబ్యూట్ సంస్థ నిర్వాణ సినిమాస్ విడుదల చెయ్యబోతోంది.