విజయవంతంగా మూడోవారంలో అడుగిడిన 'టిక్ టిక్ టిక్'
Send us your feedback to audioarticles@vaarta.com
ఈమధ్యకాలంలో స్ట్రయిట్ సినిమాలే రెండు వారాలపాటు థియేటర్లలో ప్రదర్శితమవ్వడానికి నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఒక డబ్బింగ్ సినిమాగా విడుదలైన "టిక్ టిక్ టిక్" కమర్షియల్ సినిమా కాకపోయినా.. మాస్ ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేసే స్పెషల్ సాంగ్స్, ఫైట్స్ ఏమీ లేకపోయినా.. కంటెంట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటూ మూడోవారంలోకి అడుగిడింది. జయంరవి-నివేతా పెతురాజ్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం తమిళ-తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల కాగా రెండు చోట్ల సూపర్ హిట్ టాక్ తో ప్రేక్షకుల్ని అలరిస్తూ నేటితో మూడోవారంలోకి అడుగిడింది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చదలవాడ లక్ష్మణ్ మాట్లాడుతూ.. "ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారుతోంది. కమర్షియల్ అంశాలకంటే కంటెంట్ కి ఎక్కువ వేల్యూ ఇస్తున్నారు. అందుకే మా "టిక్ టిక్ టిక్"ను విశేషమైన రీతిలో ఆదరిస్తూ మంచి విజయాన్ని అందించారు. పెద్దలతోపాటు పిల్లలు కూడా మా చిత్రాన్ని ఆదరిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. మేం ఉహించినదానికంటే భారీ స్థాయిలో కలెక్షన్స్ ఉన్నాయి. ఇదే తరహాలో వైవిధ్యమైన చిత్రాలు మా సంస్థ నుంచి వస్తూనే ఉంటాయి. ప్రేక్షకులకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో మాత్రమే చూడాలని కోరుకొంటున్నాము.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com