హర్రర్ సస్పెన్స్ ఎంటర్ టైనర్ గా 'టిక్ టాక్'
Send us your feedback to audioarticles@vaarta.com
పి.హెచ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న హార్రర్, ఫన్, లవ్ కాన్సెప్ట్ మూవీ సినిమా `టిక్ టాక్`.హోప్ చిత్రానికి నేషనల్ అవార్డ్ అందుకుని, చంద్రహాస్ చిత్రానికి స్వర్ణ నందిని పొంది, సతీష్, దేవాకట్టా వంటి దర్శకుల్ని, వెన్నెలకిషోర్, పార్వతీమెల్టన్ వంటి నటీనటులను పరిచయం చేసిన సరోజిని దేవి ఇంట్రిగేషన్ అవార్డ్ గ్రహీత పోలిచర్ల హరనాథ్ నిర్మిస్తూ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రోమో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరగుతుంది. టి.ప్రసన్నకుమార్ ప్రోమోను విడుదల చేశారు.
హీరో, నిర్మాత, దర్శకుడు పోలిచర్ల హరనాథ్ మాట్లాడుతూ.... హార్రర్, కామెడి జోనర్‌లో అన్నీ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి చేసిన సినిమా ఇది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమా ఉంటుంది. అశ్లీలత ఉండదు. ఎంటర్‌టైనింగ్‌తో అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరించేలా సినిమా ఉంటుంది. తెలుగు సినిమాలో ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా ఓ సాంగ్‌ను పిక్చరైజ్ చేశాం. సినిమాలో అశ్లీలత ఉండదు. వచ్చే రెండేళ్ళలో నాలుగు సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాను అని తెలిపారు. `` అన్నారు.
టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ... చంద్రహాస్, హోప్, చాప్టర్ 6 వంఇ డిఫరెంట్ సినిమాలు చేసిన హరినాథ్ పొలిచెర్లగారు ఇప్పుడు సక్సెస్ సాధిస్తున్న హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో టిక్ టాక్ సినిమా చేశారు. ఈ సినిమా ఆయనకు చాలా పెద్ద హిట్ కావాలని ప్రసన్నకుమార్ అన్నారు.
పోలిచర్ల హరనాథ్, నిషిగంద, మౌనిక, రాహుల్, సందీప్ ఆనంద్, సాయికృష్ణ, అల్లూ రమేష్, రమణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః పి.వంశీకృష్ణ, సంగీతంః ఎస్ అండ్ బి మ్యూజిక్ మిల్, ఎడిటర్ః వెంకట రమణ, ఆర్ట్ః ఇ.గోవింద్, మూలకథః లిఖిత్ శ్రీనివాస్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత, డైరెక్షన్ః పొలిచర్ల హరినాథ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com