కామెడీ హారర్ తో 'టిక్ టాక్'
Send us your feedback to audioarticles@vaarta.com
గతంలో 'హోప్', 'చంద్రహాస్' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన నటుడు, నిర్మాత, దర్శకుడు పోలిచర్ల హరనాధ్ తాజాగా నటిస్తూ దర్శకనిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం 'టిక్ టాక్'. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన 'హరనాధ్ పోలిచర్ల టిక్ టాక్.కామ్' పేరిట రూపొందించిన వెబ్ సైట్ ను ఈ నెల 9న హైదరాబాద్ సారధి స్టూడియోలో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆర్. పి. పట్నాయక్ మాట్లాడుతూ.. 'హరనాధ్ గారు చక్కని సదుద్దేశ్యంతో సినిమాలు చేస్తుంటారు. ప్రస్తుతం సినిమాకు ప్రమోషన్ చాలా అవసరం. ఈ నేపథ్యంలో హరనాధ్ గారు వెబ్ సైట్ లాంచ్ చేయడం చాలా మంచి ఆలోచన. హరనాధ్ గత చిత్రాల వలె ఈ చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అన్నారు. పోలిచర్ల హరనాధ్ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం సినిమాకి పబ్లిసిటీకి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. సినిమాని ప్రేక్షకులకు చేరువ చేయడంలో భాగంగా ఈ వెబ్ సైట్ ను ప్రారంభిచాను. కామెడీ హారర్ గా రూపొందుతున్న చిత్రమిది. అన్ని వర్గాల వారిని అలరించేలా ఈ చిత్రం ఉంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత రెగ్యులర్ గా 5 సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.
పోలిచర్ల హరనాధ్, నిషిగంధ, మౌనిక, రాహుల్, సందీప్ ఆనంద్, సాయి కృష్ణ, అల్లూ రమేష్, రమణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎస్ అండ్ బి మ్యూజిక్ మిల్, కెమెరా: పి. వంశీకృష్ణ, ఎడిటింగ్: వెంకట రమణ, ఆర్ట్: ఏ.గోవింద్, పాటలు: కరుణాకర్, చారి, డాన్స్: గోవింద్ సి.హెచ్, మూలకథ: లిఖిత్ శ్రీనివాస్, కథ- స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం- నిర్మాత: పోలిచర్ల హరనాధ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments