కామెడీ హారర్ తో 'టిక్ టాక్'

  • IndiaGlitz, [Friday,March 10 2017]

గతంలో 'హోప్', 'చంద్రహాస్' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన నటుడు, నిర్మాత, దర్శకుడు పోలిచర్ల హరనాధ్ తాజాగా నటిస్తూ దర్శకనిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం 'టిక్ టాక్'. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన 'హరనాధ్ పోలిచర్ల టిక్ టాక్.కామ్' పేరిట రూపొందించిన వెబ్ సైట్ ను ఈ నెల 9న హైదరాబాద్ సారధి స్టూడియోలో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆర్. పి. పట్నాయక్ మాట్లాడుతూ.. 'హరనాధ్ గారు చక్కని సదుద్దేశ్యంతో సినిమాలు చేస్తుంటారు. ప్రస్తుతం సినిమాకు ప్రమోషన్ చాలా అవసరం. ఈ నేపథ్యంలో హరనాధ్ గారు వెబ్ సైట్ లాంచ్ చేయడం చాలా మంచి ఆలోచన. హరనాధ్ గత చిత్రాల వలె ఈ చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అన్నారు. పోలిచర్ల హరనాధ్ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం సినిమాకి పబ్లిసిటీకి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. సినిమాని ప్రేక్షకులకు చేరువ చేయడంలో భాగంగా ఈ వెబ్ సైట్ ను ప్రారంభిచాను. కామెడీ హారర్ గా రూపొందుతున్న చిత్రమిది. అన్ని వర్గాల వారిని అలరించేలా ఈ చిత్రం ఉంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత రెగ్యులర్ గా 5 సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.

పోలిచర్ల హరనాధ్, నిషిగంధ, మౌనిక, రాహుల్, సందీప్ ఆనంద్, సాయి కృష్ణ, అల్లూ రమేష్, రమణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎస్ అండ్ బి మ్యూజిక్ మిల్, కెమెరా: పి. వంశీకృష్ణ, ఎడిటింగ్: వెంకట రమణ, ఆర్ట్: ఏ.గోవింద్, పాటలు: కరుణాకర్, చారి, డాన్స్: గోవింద్ సి.హెచ్, మూలకథ: లిఖిత్ శ్రీనివాస్, కథ- స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం- నిర్మాత: పోలిచర్ల హరనాధ్.

More News

ప్రారంభమైన 'శిఖండి' షూటింగ్

శ్రీ చర్ల మూవీస్ పతాకం పై చర్ల శ్రీనివాస్ యాదవ్ నిర్మిస్తోన్న చిత్రం “శిఖండి”. పి.రాజారెడ్డి ఈ సినిమాతో దర్శకునిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు.

డబ్బింగ్ మొదలుపెట్టిన 'ఏంజెల్'

బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ టైటిల్ రోల్ లో తెరకెక్కుతోన్న సినిమా “ఏంజిల్”. యంగ్ హీరో నాగ అన్వేష్, ఓ ఛాలెజింగ్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంతో దర్శకధీరుడు రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకుడిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు.

'పిచ్చిగా నచ్చావ్' ట్రైలర్ ఆవిష్కరణ

''ప్రేమన్నది యూనివర్సెల్. కానీ ప్రేమలో ఉన్న ప్రతి మనిషి తనదైన శైలిలో నిర్వచనం చెబుతుంటారు. అంటే ప్రేమ అన్నది వ్యక్తిగతం కూడా. చిన్న విషయాన్ని కూడా అర్ధం చేసుకోకుండా నేటి యువత కోపం, ఈర్ష్య, ద్వేషం పెంచుకుపోతున్నారు.

కిట్టుగాడి విజయ యాత్ర

వరుస విజయాలతో సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్న యువ కథానాయకుడు రాజ్ తరుణ్ హీరోగా, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్గా ఏటీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వంశీకృష్ణ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర దర్శకత్వంలో రూపొందించిన హిలేరియస్ ఎంటర్టైనర్ `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`.

జాహ్నవి ఫిలింస్ బ్యానర్ లో అల్లరి నరేష్ కొత్త చిత్రం

మలయాళం లో ఘన విజయం సాధించిన 'ఓరు వడక్కన్ సెల్ఫీ' చిత్రం అల్లరి నరేష్ హీరోగా తెలుగులో రీమేక్ కాబోతుంది. జాహ్నవి ఫిలింస్ బ్యానర్పై శ్రీమతి నీలిమ సమర్పణలో చంద్రశేఖర్ బొప్పన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. 'ఓరు వడక్కన్ సెల్ఫీ' మలయాళ మాతృక చిత్రాన్ని డైరెక్ట్ చేసిన జి. ప్రజీత్ ఈ రీమేక్కి దర్శకత్వం వహించనున్నారు.