'బాహుబలి 2' రికార్డులను టైగర్ అధిగ మిస్తుందా?

  • IndiaGlitz, [Thursday,December 28 2017]

స‌ల్మాన్ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'టైగ‌ర్ జిందా హై'. క‌త్రినా కైఫ్ నాయిక‌. డిసెంబ‌ర్ 22న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. తొలిరోజు 34.01, రెండో రోజు 35.30, మూడో రోజు 45.53 నాలుగో రోజు 36.54 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసింది.

విడుద‌లైన ఐదు రోజుల్లోనే 173.07 కోట్ల రూపాయ‌ల‌ను ఈ చిత్రం క‌లెక్ట్ చేయ‌డం విశేషం. ఇప్పుడు ట్రేడ్ వ‌ర్గాల ఈ టైగ‌ర్ 'బాహుబ‌లి 2' రికార్డుల‌ను బ‌ద్ధ‌లు చేస్తుందా? లేదా ? అనే లెక్క‌లు క‌డుతున్నాయి. 2017 ఏడాదిలో 'గోల్ మాల్ ఎగైన్‌' చిత్రం 205.17కోట్ల క‌లెక్ష‌న్స్‌తో నెంబ‌ర్ వ‌న్‌గా ఉంది. ఈ రికార్డుని టైగ‌ర్ జిందా హై రెండు రెండు మూడు రోజుల్లో టైగ‌ర్ జిందా హై అధిగ‌మిస్తుంద‌ని టాక్‌.

More News

'జైసింహా' కు గుమ్మడికాయ కొట్టేశారు...

నటసింహ నందమూరి బాలకృష్ణ 102వ చిత్రం 'జై సింహా' ప్యాచ్ వర్క్ సహా చిత్రీకరణను పూర్తి చేసుకుంది.

ఆ విష‌యంపై సునీల్ క్లారిటీ ఇచ్చేశాడు?

క‌మెడియ‌న్ నుండి హీరోగా మారిన సునీల్‌కు ప్రారంభంలో అందాల రాముడు, పూల రంగ‌డు, మ‌ర్యాద‌రామ‌న్న‌సినిమాలు స‌క్సెస్ తెచ్చిపెట్టినా త‌ర్వాత అనుకున్న స్థాయిలో హిట్ ద‌క్క‌లేదు. దీంతో సునీల్ మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా న‌టించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడ‌ని వార్త‌లు వినిపించాయి.

ప్రిన్స్‌గా రామ్‌చ‌ర‌ణ్‌?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, క్లాస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'రంగస్థలం'. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 30న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా, చరణ్ తన తదుపరి చిత్రాన్ని బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేయబోతున్న విషయం తెలిసిందే.

ర‌వితేజ హీరోయిన్ ఎవ‌రంటే..?

తాజాగా 'రాజా ది గ్రేట్' ద్వారా సక్సెస్ ని సొంతం చేసుకున్నారు మాస్ మహారాజ్ రవితేజ. జ‌న‌వ‌రి 25కి విక్రమ్ సిరికొండ తెరకెక్కించిన 'టచ్ చేసి చూడు'తో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ చిత్రం త‌రువాత‌.. 'సోగ్గాడే చిన్ని నాయనా', 'రారండోయ్‌ వేడుక చూద్దాం' లాంటి సూపర్ హిట్స్ ని అందించిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో తన తదుపరి చిత్రాన్ని లైన్ లో పె&

ర‌వితేజ త‌రువాత నాగార్జున‌తో..

2016 సంక్రాంతికి సంద‌డి చేసిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'. ఇందులో బంగార్రాజుగా నాగార్జున చేసిన హంగామా అభిమానుల‌ను మెప్పించింది. ఈ చిత్రంతోనే ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు కళ్యాణ్ కృష్ణ.