Tiger Nageswara Rao:ఓటీటీలోకి వచ్చేసిన 'టైగర్ నాగేశ్వరరావు.. ఎందులో స్ట్రీమింగ్ అంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజ రవితేజ తొలిసారి పాన్ ఇండియా హీరోగా నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' డివైడ్ టాక్ తెచ్చుకుని ఓ మోస్తరు విజయంతో సరిపెట్టుకుంది. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాను వంశీ దర్శకత్వత వహించాడు. ఇక మూవీలో రేణుదేశాయ్ కీలక పాత్రలో నటించగా.. నుపూర్‌సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా కనిపించారు. అక్టోబర్ 20న దసరా కానుకగా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది.
సినిమా నిడివి ఎక్కువగా ఉండటం, బయోపిక్ అని చెప్పి కల్పిత కథను తెరకెక్కించడం వంటి అంశాలు సినిమా ఫలితంపై ప్రభావం చూపాయి. దీంతో హిందీతో పాటు సౌత్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. తొలుత ఈనెల 27న అమెజాన్ ప్రైమ్‌లో వస్తుందని తెలిపినా.. 10 రోజులు ముందుగానే శుక్రవారం తెల్లవారుజామున నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలో ప్రసారమవుతోంది.
ఇక రవితేజ ప్రస్తుతం తనకు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు. డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి హిట్స్ వీరి కలయికలో వచ్చాయి. ఇప్పుడు మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలై షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల క్రాక్ తర్వాత రవితేజ నటించిన సినిమాలన్ని వరుసగా ఫ్లాపులు అయ్యాయి. దీంతో ఈ చిత్రంపై రవి చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ సినిమాతో పాటు హరీశ్ శంకర్ దర్శకత్వంలోనూ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout