బాహుబ‌లిని బీట్ చేసిన టైగ‌ర్‌...

  • IndiaGlitz, [Saturday,November 11 2017]

స‌ల్మాన్ ఖాన్, క‌త్రినా కైఫ్ న‌టించిన చిత్రం 'టైగ‌ర్ జిందా హై'. గ‌తంలో స‌ల్మాన్‌, క‌త్రినా న‌టించిన 'ఏక్ థా టైగ‌ర్‌' చిత్రానికిది సీక్వెల్‌గా రూపొందింది. సినిమాను ఈద్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 22న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

అలీ అబ్బాస్ జహీర్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ ట్రైల‌ర్ లైకుల ప‌రంగా 'బాహుబ‌లి 2' లైకుల రికార్డుల‌ను క్రాస్ చేసింది.

వివ‌రాల్లోకెళ్తే..'బాహుబ‌లి 2' ట్రైల‌ర్ 5,41,000 లైకుల‌ను రాబ‌ట్టుకుంటే 'టైగ‌ర్ జిందా హై' చిత్రానికి 7,22,000 లైకులు వ‌చ్చాయి. మ‌రి ఈ సినిమా క‌లెక్ష‌న్స్ ప‌రంగా 'బాహుబ‌లి 2' రికార్డుల‌ను అధిగ‌మిస్తుందా? ఏమో చూద్దాం..