శర్వా..సాయిపల్లవి మధ్య గొడవలా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఫిదాతో తెలుగు వారి హృదయాలకు దగ్గరైన హీరోయిన్ సాయిపల్లవి.. ఇక్కడి హీరోలకు మాత్రం ఆమడ దూరంలో ఉంటుందని సమాచారం. ఇంతకు ముందు `కణం` సినిమా సమయంలో కూడా సాయిపల్లవి బిహేవియర్ కారణంగా.. నాగశౌర్య ఆమెతో ఎడమోహం పెడమోహంగా ఉన్నాడు. తాజాగా మరో హీరో కూడా సాయిపల్లవితో అలాగే ఉంటున్నాడు.
ఆ హీరో ఎవరో కాదు.. శర్వానంద్. శర్వా, సాయిపల్లవి కలయికలో హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రం `పడి పడి లేచె మనసు`. ఈ సినిమా చిత్రీకరణలో సాయిపల్లవి ఈగోయిస్టిక్‌గా ప్రవరిస్తుందని శర్వానంద్ హర్ట్ అయ్యాడట. అయితే యూనిట్ శర్వాకు సర్దిచెప్పి షూటింగ్ కానిచ్చేస్తున్నారట. ఇలా ప్రవర్తనతో సాయిపల్లవి తెలుగులో రాణింపు కష్టమవుతుందని గుసగుసలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments