దేశంలో 18 కోట్ల మందికి కరోనా.. షాకింగ్ విషయాలు చెప్పిన థైరోకేర్

  • IndiaGlitz, [Friday,July 24 2020]

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. మరోవైపు ఇండియాలో కరోనా మరింత తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది. టెస్టులు చేసే కొద్దీ కేసులు బయట పడుతూనే ఉన్నాయి. అయితే టెస్టులు చేయించుకోని వారిలో కరోనా లేదు అనుకోవడానికి లేదని థైరోకేర్ అనే డయాగ్నస్టిక్స్ సంస్థ చెబుతోంది. ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. కొందరి దేహాల్లోకి వైరస్ సైలెంట్‌గా చేరిపోతోందని.. అది వారికి కూడా తెలియదని.. అయితే వారి దేహంలోని ఇమ్యూనిటీ పవర్ కారణంగా వారి దేహంలోకి కరోనా ఎప్పుడొచ్చిందో.. ఎప్పుడెళ్లిపోయిందో కూడా వారికి తెలియదని థైరోకేర్ తెలిపింది.

ఈ సంస్థ ద్వారా చేసిన అధ్యయనాలను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆరోకియాస్వామి వేలుమణి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దేశం మొత్తం మీద ఇప్పటి వరకూ 12 లక్షల మందికి కరోనా సోకినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కానీ షాకింగ్ విషయమేంటంటే.. దేశం మొత్తమ్మీద 18 కోట్ల మందికి కరోనా వచ్చి ఉండొచ్చని థైరోకేర్ సంస్థ స్టడీ తేల్చి చెప్పింది. 60 వేల మందికిపైగా యాంటీబాడీ టెస్టులు చేయగా, 15 శాతం మందికి కరోనా యాంటీబాడీలున్నట్టు ఆ స్టడీలో తేలిందని ఆరోకియాస్వామి వేలుమణి తెలిపారు.

‘‘90 శాతం మంది ఇంకా కరోనాకు ఎక్స్ పోజ్ కాలేదు. 9 శాతం మంది ఎక్స్ పోజ్ అయినా వాళ్లకు సింప్టమ్స్ లేవు. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉన్నోళ్లకు అది ఉన్నట్టు కూడా తెలియదు. 0.9 శాతం మందికి సింప్టమ్స్ ఉన్నా.. సగటు ఇమ్యూనిటీ పవర్‌తో అది తగ్గిపోయింది. వాళ్లకు అది సోకినట్టు కూడా తెలియదు. 0.09 శాతం మందికి తక్కువ ఇమ్యూనిటీ ఉంది. వాళ్లకు వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో వాళ్లు ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుని నయం చేసుకున్నారు. 0.01 శాతం మందికి అసలు ఇమ్యూనిటీనే లేదు’’ అని ఆరోకియాస్వామి ట్వీట్ లో పేర్కొన్నారు.

More News

‘బిచ్చగాడు 2’ ఫస్ట్‌లుక్ విడుదల

మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎన్నో సూప‌ర్‌హిట్ చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన విజ‌య్ ఆంటోని.. హీరోగా,నిర్మాత‌గా నకిలీ’ సినిమాను నిర్మించారు.

హోం ఐసోలేషన్‌లో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత

తెలంగాణలో మరీ ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా ఏ స్థాయిలో విస్తరిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

శాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

సునిశిత్ స్టార్ తెలుసా? అంటే పెద్దగా ఎవరికీ తెలియదు కానీ శాక్రిఫైసింగ్ స్టార్ అంటే మాత్రం తెలియని వారుండరు.

షాకింగ్.. ఏపీలో ఇవాళ ఒక్కరోజే 7998 కేసులు

ఏపీలో షాకింగ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఏపీకి సంబంధించిన కరోనా బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

పూరి ఆకాష్‌ని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజన్స్..

డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాష్‌ని నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.