మలయాళంలో బాహుబలి2 బిజినెస్ అదురగొట్టింది...
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న బాహుబలి పార్ట్ 2 బాహుబలి ది కన్ క్లూజన్ 2017 ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతుంది. విడుదలకు ముందే బిజినెస్ విషయంలో కొత్త రికార్డులు దిశగా బాహుబలి అడుగులు వేస్తుంది. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రం మలమాళ విడుదల హక్కులు 10.50 కోట్ల రూపాయల ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైందని మాలీవుడ్ వర్గాల సమాచారం.
బాహుబలి ది బిగినింగ్ చిత్రం 600 కోట్ల కలెక్షన్స్‌తో తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చాటిన సంగతి తెలిసింది. ఇప్పుడు బాహుబలి 2 కలెక్షన్స్ పరంగా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. రీసెంట్ గా తమిళం, మలయాళం హక్కులను కె ఎంటర్టైన్మెంట్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ 95 కోట్లను చెల్లించి చేజిక్కించుకుందట. అందులో మలయాళానికి 10.50 కోట్లు చెల్లించారని టాక్. ఈ సినిమా చిత్రీకరణను నవంబర్‌కు పూర్తి చేసి తదుపరి నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments