థ్రిల్లర్ వెర్సస్ కామెడీ ఎంటర్ టైనర్
Send us your feedback to audioarticles@vaarta.com
చిత్ర పరిశ్రమలో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. అలాంటి వాటిలో ఒకటి.. ఓసారి కలిసి నటించిన వాళ్ళే.. మరోసారి పోటీపడడం. ఇలాంటి పరిస్థితే కథానాయకుడు మంచు విష్ణు, అగ్ర కథానాయిక అనుష్క విషయంలో జరుగనుంది.
2006లో విడుదలైన అస్త్రం` చిత్రంలో ఈ ఇద్దరు కలిసి నటించారు. మళ్లీ 12 ఏళ్ల తరువాత ఈ ఇద్దరు నువ్వా నేనా అంటూ బరిలోకి దిగుతున్నారు.
కాస్త వివరాల్లోకి వెళితే.. బాహుబలి 2 తరువాత అనుష్క నటిస్తున్న సినిమా భాగమతి. థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి పిల్ల జమీందార్` ఫేమ్ అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. సరిగ్గా అదే రోజున.. విష్ణు నటించిన కొత్త చిత్రం ఆచారి అమెరికా యాత్ర` కూడా విడుదలకి ముస్తాబవుతోంది.
జి.నాగేశ్వర రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. దేనికైనా రెడీ`, ఈడో రకం ఆడో రకం` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత విష్ణు, నాగేశ్వరరెడ్డి కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి.
థ్రిల్లర్, కామెడీ ఎంటర్టైనర్.. ఇలా వేర్వేరు జోనర్స్లో తెరకెక్కుతున్న ఈ సినిమాల్లో దేనికి విజయం వరిస్తుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments