పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న '3ల్'
Send us your feedback to audioarticles@vaarta.com
సుక్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఫాదర్ అండ్ మదర్ సమర్పణలో సంజీవ్‌కుమార్ హీరోగా సురేష్ సబ్నే దర్శకత్వంలో నిర్మాత సంజీవ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం 'థ్రిల్'. పవిత్ర, సోనాలి హీరోయిన్స్. సుమన్ శెట్టి, రేలంగి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలు పోషించారు. ఇదొక సస్పెన్స్‌తో కూడుకున్న అద్భుతమైన ప్రేమకథా చిత్రం. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్ర నిర్మాత సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ - ''ఈ చిత్రం మంచి సస్పెన్స్‌తో వుంటూ ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తుంది. దర్శకుడు సబ్నే చెప్పిన కథ నాకు బాగా నచ్చడంతో నేనే హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించాను. దర్శకుడు చిత్ర కథను ఎంత బాగా చెప్పాడో ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా చిత్రాన్ని కూడా చాలా బాగా తెరకెక్కించాడు. కథ మీద వున్న నమ్మకంతో పబ్లిసిటీని చాలా గ్రాండ్‌గా ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. 'ప్రేమకథా చిత్రం', 'క్షణం', హిందీలో 'రాజ్', '1920' చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగా అలరించాయో ఆ చిత్రాల తరహాలో మా చిత్రం కూడా అంతగా ప్రేక్షకాదరణ పొందుతుందన్న నమ్మకంతో వున్నాం.
చిత్రంలో గ్రాఫిక్స్ చాలా బాగుంటాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జూలై నెలాఖరులో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు. చిత్ర దర్శకుడు సురేష్ సబ్నే మాట్లాడుతూ - ''నేను దర్శకుడిగా ఓ మంచి చిత్రం తియ్యాలన్న ప్రయత్నంలో నాకు సంజీవ్‌గారు పరిచయమయ్యారు. అలాగే ఆయన కూడా మంచి కథ దొరికితే సినిమా చెయ్యాలనుకుంటున్నట్లుగా ఒకనొక సందర్భంలో నాతో చెప్పారు. దాంతో నా దగ్గరున్న ఓ కథను ఆయనకి చెప్పటం జరిగింది. నేను చెప్పిన కథ ఆయనకి బాగా నచ్చడంతో తనే తొలిసారిగా హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సంజీవ్‌కుమార్ తొలిసారి హీరోగా నటించినప్పటికీ ఎంతో ఎక్స్పీరియన్స్ వున్న నటుడిగా, ఇప్పుడున్న పెద్ద హీరోలకి ఏ మాత్రం తగ్గకుండా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్‌గా కూడా ది బెస్ట్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు. సుమన్ శెట్టి, రేలంగి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించిన పవిత్ర, సోనాలి వారి క్యారెక్టర్స్‌కి తగిన న్యాయం చేశారు. సంగీత దర్శకుడు మురళి లియోన్ 5 పాటలకి సూపర్ మ్యూజిక్‌నిచ్చారు. ఆడియోను లహరి మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేశాం. ఆడియోకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ చిత్రంలో మూడు పాటల్ని అందమైన లొకేషన్లలో చిత్రీకరించడం జరిగింది. వికారాబాద్ ఫారెస్ట్, జహీరాబాద్ వాటర్ ఫాల్స్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిపాం. సుధాకర్ నాయుడు ఫొటోగ్రఫీ ఈ చిత్రానికి ఓ హైలైట్ కానుంది. అలాగే మా చిత్రం ఎడిటర్ నాగిరెడ్డిగారు మా సినిమా ఔట్పుట్ చూసి.. 'కొత్తవాళ్లైనా సినిమా చాలా బాగా తీశారు...' అంటూ మమ్మల్ని అప్రిషియేట్ చేయడంతో చిత్రం సక్సెస్‌పై మా నమ్మకం మరింత రెట్టింపు అయ్యింది. సబ్జెక్ట్‌లో కొత్తదనం వున్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. మా చిత్రాన్ని కూడా ఆడియన్స్ గ్యారెంటీగా సక్సెస్ చేస్తారన్న నమ్మకంతో వున్నాం'' అన్నారు. సంజీవ్ కుమార్, పవిత్ర, సోనాలి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సుమన్ శెట్టి, రేలంగి, వెంకట్ తదితరులు నటించగా ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: సుధాకర్ నాయుడు, ఎడిటింగ్: నాగిరెడ్డి, సంగీతం: మురళి లియోన్, కో-రైటర్, కో-డైరెక్టర్: జి.సంతోష్‌కుమార్, నిర్మాత: జి.సంజీవ్‌కుమార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేష్ సబ్నే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments