మూడేళ్లపాటు నందమూరి హీరోలతో
Send us your feedback to audioarticles@vaarta.com
గతేడాది వరకు టాలీవుడ్‌లో ఆమెకు ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర ఉండేది. అయితే ఒకే ఒక్క సినిమా ఆమె జాతకాన్నే మార్చేసింది. ఆ తరువాత వద్దన్నా అవకాశాలు ఆమె కోసం వేచి చూస్తున్నాయి. ఆమె మరెవరో కాదు 'రెయిన్‌బో' తో తెలుగునాట హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సోనాల్ చౌహాన్. ఆమె జాతకాన్ని మార్చిన ఆ చిత్రం నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన 'లెజెండ్'. లెజెండ్ హిట్‌తో సోనాల్.. టాలీవుడ్‌లో వాంటెడ్ హీరోయిన్‌గా మారింది.
నిన్నటికి నిన్న 'పండగ చేస్కో' తో చెప్పుకోదగ్గ హిట్‌ని కూడా సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అతి త్వరలో అనుష్క 'సైజ్ జీరో'లోనూ ఓ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ అవకాశాలన్నీ ఓ ఎత్తు అయితే.. ఏడాదికో నందమూరి వారి సినిమా ఆమె ఖాతాలో ఉండడం మరో ఎత్తు. 2014లో బాలయ్యతో 'లెజెండ్' కోసం ఆడిపాడిన చౌహాన్.. ఈ ఏడాదిలో మరో నందమూరి హీరో కళ్యాణ్‌రామ్‌తో 'షేర్' కోసం ఈ నెల 30న పలకరించబోతోంది. ఇక 2016లో మళ్లీ బాలయ్యతోనే 'డిక్టేటర్' కోసం సంక్రాంతి సందర్భంలో సందడి చేయబోతోంది. ఈ వరుసలోనే 2017లో ఎన్టీఆర్‌తోనూ సోనాల్ తెరపై దర్శనమిస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com