3 పద్దతుల్లో జనసేన పోరాటం..!

  • IndiaGlitz, [Saturday,August 27 2016]

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రత్యేక‌హోదా కోసం చేయ‌నున్న పోరాటం గురించి తెలియ‌చేస్తూ....ప్ర‌త్యేక హోదా పై చేసే పోరాటం ముందుకు తీసుకువెళ్ల‌డానికి అంద‌రి త‌రుపున నేను నిర్ణ‌యించుకున్నాను. ఇప్ప‌టి వ‌ర‌కు సైలెంట్ గా ఉన్న‌ది చేత కాకో, పౌరుషం లేకో కాదు. ఆచితూచి క్ర‌మ‌ప‌ద్ద‌తిలో మాట్లాడ‌డం అవ‌స‌రం అని సైలెంట్ గా ఉన్నాను. 3 ద‌శ‌లుగా ఈ పోరాటం చేస్తాను.
మొద‌టి ద‌శ‌లో అన్ని జిల్లాలు తిరుగుతాను. మ‌న‌కు జ‌రిగిన ద్రోహం ఏమిటి అనేది చెబుతాను. రెండో ద‌శ‌లో ఎక్క‌డైతే రాష్ట్రాన్ని విడ‌గొట్టాలి అని నిర్ణ‌యం తీసుకున్నారో అదే కాకినాడ‌లో సెప్టెంబ‌ర్ 9న మీటింగ్ పెడ‌తాను. అప్ప‌టికీ కేంద్రం త‌న నిర్ణ‌యం చెప్ప‌క‌పోతే...మూడ‌వ ద‌శ‌లో అంద‌రి ఆలోచ‌న‌లు, అనుమ‌తి తీసుకుని రోడ్లు పైకి వ‌చ్చి ఎలా సాధించుకోవాలో నిర్ణ‌యం తీసుకుంటాం అంటూ జ‌న‌సేన ప్లాన్ ఏమిటో చెప్పారు. అలాగే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బిజెపి తో క‌లిసి జ‌న‌సేన పార్టీ పోటీ చేయ‌నుంది అంటున్నారు అలాంటి ఇంట్ర‌స్ట్ లేదు అంటూ ఆ ప్ర‌చారానికి ఫుల్ స్టాప్ పెట్టారు ప‌వ‌న్.

More News

సర్ధార్ సరిగా చూడలేదు ఈసారి గట్టిగా చూడండి - పవన్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సభలో ఆవేశంగా రాజకీయాల గురించే కాదు...సరదాగా సినిమాలగురించి కూడా మాట్లాడి నవ్వించారు.

సినిమాను కాదు నిజ జీవితాన్ని సీరియస్ గా తీసుకోండి - పవన్..!

మరణించిన అభిమాని వినోద్ మరణం గురించి పవన్ మాట్లాడుతూ....సినిమాని వినోదంగానే చూడండి.

తెలుగుదేశం పార్టీకి భుజం కాసినప్పుడు నా కులం గుర్తుకురాలేదా - పవన్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతూ...నేను తెలుగుదేశం పక్షపాతిని తొత్తుని కాదు. ప్రజల పక్షపాతిని రైతు పక్షపాతిని...

జనసేన భజన సేన కాదు...తెలుగు రాష్ట్రాల ప్రజలకు భజన సేన - పవన్

జనసేన పార్టీ అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతి తుడా ఇందరా గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ...

'కాష్మోరా' డబ్బింగ్ పూర్తి చేసిన కార్తీ

యంగ్ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి.సినిమా,డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకాలపై గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి,