మ‌ల్టీస్టార‌ర్ కోసం మూడు నిర్మాణ సంస్థ‌లు...

  • IndiaGlitz, [Friday,March 30 2018]

తెలుగులో మ‌ల్టీస్టార‌ర్ సంస్కృతి ఎక్కువ అవుతుంది. అందులో భాగంగా విక్ట‌రీ వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో ఓ మ‌ల్టీస్టార‌ర్ రూపొంద‌నుంది. గ‌త ఏడాది 'జై ల‌వకుశ‌'తో స‌క్సెస్ అందుకున్న ద‌ర్శ‌కుడు కె.రవీంద్ర (బాబి) ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన చ‌ర్చ‌లు, ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వివ‌రాల ప్ర‌కారం ఈ సినిమాను మూడు నిర్మాణ‌ సంస్థ‌లు నిర్మించ‌నున్నాయి.

అందులో ఒక‌టి వెంక‌టేశ్‌కు చెందిన నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌.. కాగా మ‌రో సంస్థ కోన ఫిలింస్ .. మూడో సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ. జూన్‌లో సినిమా ప్రారంభ‌మ‌వుతుందని టాక్‌. ఇందులో వెంక‌టేశ్ స‌ర‌స‌న న‌య‌న‌తార‌, నాగ‌చైత‌న్య స‌ర‌స‌న స‌మంత హీరోయిన్స్‌గా న‌టిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  

More News

ఆరో స్థానంలో 'రంగ‌స్థ‌లం'

1985 కాలం నాటి ప‌రిస్థితుల‌తో.. గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రంగా 'రంగస్థలం' చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు సుకుమార్.

చ‌ర‌ణ్ ఎంట్రీ డేట్ ఫిక్స‌య్యింది...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

'మ‌ణిక‌ర్ణిక' షూటింగ్ పూర్తి

భిన్నమైన కథలతో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు క్రిష్. ప్రస్తుతం వీరనారి ఝాన్సీ లక్ష్మిబాయి జీవితం ఆధారంగా 'మణికర్ణిక' సినిమాని తెరకెక్కిస్తున్నారు.

గ్రాఫిక్స్ హైలెట్ గా అరుంధతి అమావాస్య

కె వంశీధర్ సమర్పణలో మిస్ కర్ణాటక అర్చన మసలి ముఖ్య పాత్రలో తోట కృష్ణ దర్శకత్వంలో, శ్రీ కృష్ణ శంకర్ ప్రొడక్షన్స్ పతాకం పై కనమర్లపూడి కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ''అరుంధతి అమావాస్య''.

జూన్ నుంచి సాయిధ‌ర‌మ్ తేజ్ చిత్రం

పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, సుప్రీమ్..