ఎన్టీఆర్ బయోపిక్‌లో మరో ముగ్గురు హీరోలు?
Send us your feedback to audioarticles@vaarta.com
మహానటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా 'యన్.టి.ఆర్' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌ను నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంచలన దర్శకుడు తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్‌ను రంగంలోకి దింపారు.
ఇక నటీనటుల విషయానికొస్తే.. ప్రధాన పాత్రను బాలకృష్ణ పోషిస్తుండగా.. చంద్రబాబు నాయుడు పాత్రలో రానా కనిపించనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో హీరో కూడా వచ్చి చేరారు. ఆ హీరో మరెవరో కాదు.. కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన తొలినాళ్ళలో చైతన్య రథం ఎక్కి ఎన్నికల ప్రచారం సాగించగా.. ఆ రథానికి ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ సారథిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ సినిమాలో హరికృష్ణ పాత్ర కోసం కళ్యాణ్ రామ్‌ను సంప్రదించినట్టు సమాచారం. అయితే.. ఈ విషయమై కళ్యాణ్ రామ్ నుండి ఎటువంటి ధృవీకరణ రాలేదు. ఇదిలా ఉంటే.. నారా రోహిత్, తారకరత్న కూడా ముఖ్య పాత్రలు పోషించనున్నట్టు సమాచారం. దాదాపుగా నందమూరి హీరోలందరూ నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు మాత్రం ఇప్పటివరకు ప్రస్తావనకు రాలేదు.
ఈ సినిమాలో నటించమని తనని ఎవరూ సంప్రదించలేదని.. ఒకవేళ సంప్రదిస్తే తప్పకుండా తన అంగీకారం చెబుతానని ఇటీవల తారక్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా.. మే నుంచి చిత్రీకరణను ప్రారంభించి ఈ ఏడాది దసరాకి చిత్రాన్ని వ&#
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com