జగన్ కేబినెట్‌లో ముగ్గురు #NNN #SSS #MMM!
Send us your feedback to audioarticles@vaarta.com
టైటిల్ చూడగానే.. ఇదేంటి దర్శకధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న #RRR చిత్రం గురించి విన్నంకానీ.. ఈ కథేంటబ్బా అని ఆలోచిస్తున్నారా..? అవును వైఎస్ జగన్ కేబినెట్‌లో కూడా (N)3, (S)3, (M)3 ఉన్నారు. వారిలో #NNN #SSS #MMM ఉన్నారు.. ఇదేదో కాస్త కన్ఫూజన్‌గా ఉందిగా.. ఇంతకీ ఆ క్యూబ్డ్ కథేంటో ఇప్పుడు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
#NNN విషయానికొస్తే...
వైఎస్ జగన్ కేబినెట్‌లో ఒకరిద్దరు కాదు ఏకంగా.. ముగ్గురు నానిలు ఉన్నారు. దీంతో #NNN గా మారిపోయింది.
వీరిలో..
1. కొడాలి నాని-పౌర సరఫరాల శాఖ
2. పేర్ని నాని- రవాణా శాఖ, సమాచార ప్రసార శాఖ
3. ఆళ్ల నాని- ఉప ముఖ్యమంత్రి , వైద్య, ఆరోగ్య శాఖ
#SSS విషయానికొస్తే...
వైఎస్ జగన్ కేబినెట్‌లో ముగ్గురు శ్రీనివాస్‌లు ఉన్నారు. అంతేకాదు.. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలుండే ఏపీ అసెంబ్లీలో ఈసారి ఏకంగా 13 శ్రీనివాసరావులు ఉన్నారు. రేపొద్దున అసెంబ్లీలో శ్రీనివాస్ అనిపిస్తే ఎంతమంది పలుకుతారో ఏంటో..!
ఇక జగన్ కేబినెట్ విషయానికొస్తే.. ముగ్గురు శ్రీనివాస్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
1. బాలినేని శ్రీనివాసరెడ్డి- విద్యుత్, అటవీశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ
2. అవంతి శ్రీనివాస్ - టూరిజం
3. వెల్లంపల్లి శ్రీనివాస్ - దేవాదాయ శాఖ
#MMM విషయానికొస్తే..
జగన్ కేబినెట్‌లో ముగ్గురు మహిళలకు చోటు దక్కింది. కాగా.. జగన్ కేబినెట్‌లో ముగ్గురికి చోటు దక్కడం విశేషమని చెప్పుకోవచ్చు.
1. పాముల పుష్పశ్రీవాణి- ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం)
2. తానేటి వనిత - మహిళా శిశుసంక్షేమ శాఖ
3. మేకతోటి సుచరిత- హోం శాఖ
బహుశా ఇలా ఒక్కో పేరుతో ముగ్గురు ఉండటం చాలా అరుదుగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇంత వరకూ జరగలేదని చెప్పుకోవచ్చు. బహుశా దేశంలో ఇలా జరగడం చాలా అరుదేమో. సో.. ఈ క్యూబ్డ్ మంత్రులు ఏ మేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments