ఒకే నెలలో మూడు సినిమాల‌తో.. 

  • IndiaGlitz, [Tuesday,May 22 2018]

‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లాంటి క్లాస్ చిత్రంతో తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మై.. తొలి తెలుగు చిత్రంతోనే ఫిల్మ్ ఫేర్‌ను కూడా సొంతం చేసుకున్న సంగీత దర్శకుడు గోపిసుందర్. ఆ త‌రువాత ‘ఊపిరి’, ‘ప్రేమమ్’, ‘నిన్నుకోరి’ లాంటి సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాదిలోనూ చెప్పుకోద‌గ్గ సినిమాల‌తో సంద‌డి చేయ‌నున్నారు గోపి. ముఖ్యంగా.. ఈ ఏడాది జూన్ నెలలో ముచ్చ‌ట‌గా మూడు సినిమాలతో ప్రేక్షకులని ఉర్రూతలూగించడానికి సిద్ధపడుతున్నారాయ‌న‌.

ఆ వివరాల్లోకి వెళితే.. రాజ్ తరుణ్, అమైరా దస్తూర్ జంటగా గోపీ సుంద‌ర్ స్వ‌ర‌సార‌థ్యంలో రూపొందిన‌ ‘రాజుగాడు’ సినిమా జూన్ 1న విడుదల కానుంది. అలాగే.. శ్రీనివాస్ రెడ్డి, సిద్ధి ఇద్నాని హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘జంబలకిడిపంబ’ జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేవిధంగా.. సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా ఎ.క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా ‘తేజ్ ఐ లవ్ యు’. గోపీ సంగీత‌మందించిన ఈ మూవీ జూన్ 21న థియేటర్‌లలోకి వ‌స్తోంది. డిఫ‌రెంట్ జోన‌ర్‌ల‌తో తెర‌కెక్కిన ఈ సినిమాల్లో గోపీకి ఏ సినిమా మరింత పేరు తీసుకువ‌స్తుందో చూడాలి.

More News

బాలయ్య కోసం మరోసారి.. పరుచూరి

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.

నాగార్జున వెర్స‌స్ స‌మంత‌

అక్కినేని నాగార్జున, చెన్నై బ్యూటీ సమంత కలిసి ఇంత‌కుముందు ‘మనం’, ‘రాజుగారిగది2’ సినిమాల్లో పోటీ ప‌డి మరీ నటించారు.

సునీల్ సంద‌డంతా అప్పుడే..

‘నువ్వేకావాలి’ సినిమాతో హాస్య‌న‌టుడిగా ప‌రిచ‌య‌మైన‌ సునీల్‌.. అన‌తి కాలంలోనే టాప్ క‌మెడీయ‌న్‌గా పేరు తెచ్చుకున్నారు.

ఎన్టీఆర్ కెరీర్‌లోనే తొలిసారిగా..

2001లో విడుద‌లైన‌ ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

అక్క‌డ హ‌వా కొన‌సాగిస్తున్న మిక్కీ

క్లాస్‌ సినిమాలకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న యువ సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్. ఇప్పటివరకు ఈ స్వరకర్త కెరీర్‌ను పరిశీలిస్తే.. తన క్లాస్ అండ్ మెలోడీ మ్యూజిక్‌