నెల రోజుల గ్యాప్‌లో మూడు సినిమాలు

  • IndiaGlitz, [Wednesday,April 25 2018]

శ‌ర‌త్ కుమార్‌.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని విల‌క్ష‌ణ న‌టుడి పేరిది. భాష ఏదైనా త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ట్టుకుంటారు ఈ వెర్స‌టైల్ ఆర్టిస్ట్‌. నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లోనూ న‌టించిన అనుభ‌వం ఆయ‌న సొంతం. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల కాలంలో తెలుగు సినిమాల్లో త‌రుచుగా క‌నిపిస్తున్నారు శ‌ర‌త్ కుమార్‌.

గ‌త ఏడాది జ‌య‌జాన‌కి  నాయ‌క చిత్రంతో అల‌రించిన శ‌రత్ కుమార్‌.. ఈ ఏడాది అయితే కేవ‌లం నెల రోజుల గ్యాప్‌లో మూడు సినిమాల‌తో సంద‌డి చేస్తున్నారు. ఆ చిత్రాలే భ‌ర‌త్ అనే నేను, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, సాక్ష్యం.

ఈ నెల 20న విడుద‌లైన భ‌ర‌త్ అనే నేనులో మ‌హేష్ బాబు తండ్రిగా ముఖ్య‌మంత్రి రాఘ‌వ రామ్ పాత్ర‌లో సంద‌డి చేసిన శ‌ర‌త్ కుమార్‌.. మే 4న విడుద‌ల కానున్న నా పేరు సూర్య‌లోనూ ఓ విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

అలాగే మే 18న రానున్న సాక్ష్యంలోనూ ఆయ‌న ప్ర‌త్యేక‌మైన పాత్ర చేశార‌ని స‌మాచారం. మొత్త‌మ్మీద.. కేవ‌లం నెల రోజుల గ్యాప్‌లో ముచ్చ‌ట‌గా మూడు సినిమాల‌తో శ‌ర‌త్ కుమార్‌ ప‌ల‌క‌రిస్తున్నార‌న్న‌మాట‌.