సినిమాల్లో రాణించాలని కల... అంతలోనే, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్ట్‌లు మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలవ్వగా.. మరణించిన వారిలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్ట్‌లు వున్నారు. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో హెచ్‌సీయూ రోడ్డులో వేగంగా వెళుతున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి.. ఆపై చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. తీవ్రంగా గాయపడిన జూనియర్ ఆర్టిస్ట్ సిద్ధూను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. జూనియర్ ఆర్టిస్ట్ కాకుండా మరణించిన మరో వ్యక్తి ఓ బ్యాంకులో పని చేస్తున్నారని తెలుస్తోంది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మద్యం సేవించినట్లు అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్ధలికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మహబూబ్ నగర్‌కు చెందిన మానస(21), కర్ణాటకకు చెందిన ఎన్ మానస (21) జూనియర్ ఆర్టిసులుగా చేస్తున్నారు. వీరితో పాటు సిద్ధూ అనే మరో జూనియర్ ఆర్టిస్ట్.. అబ్దుల్ రహీమ్ ఆ కారులో ప్రయాణించారు. అబ్దుల్ రహీమ్ మాదాపూర్‌లోని యాక్సిస్ బ్యాంకులో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతని స్థలం విజయవాడ. వీరంతా అమీర్ పేటలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నారు. అయితే కారు అతివేగంతో నడపటమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు పోలీసులు. ఎయిర్ బెలూన్లు తెరుచుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. కారు సైతం నుజ్జు నుజ్జయిన తీరు చూస్తే వీరు ఎంత వేగంగా వెళ్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com