టాలీవుడ్ 'ముగ్గురు మిత్రులు' మళ్లీ కలిశారు..!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్, హీరో ప్రిన్స్, అక్కినేని యంగ్ హీరో అఖిల్ స్నేహితులన్న విషయం తెలిసిందే. వీరి స్నేహం చిగురించి ఐదేళ్లు పైనే అయ్యింది. చాలా రోజుల తర్వాత ఈ ముగ్గురు మిత్రులు చాలా గ్యాప్ తర్వాత కలిశారు. ఎక్కడ కలిశారు..? ఏ సందర్భంలో అనే విషయం తెలియదు కానీ ఈ విషయమై ప్రిన్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించారు.
ప్రిన్స్ ఇన్స్టాగ్రామ్ సందేశం..
"మేము మరోసారి కలుస్తాము. లాంగ్ ప్రెండ్ షిప్స్ అనేవి అందమైన ఆభరణాలు లాంటివి.. శాశ్వతమైనవి" అని పోస్ట్‌లో పేర్కొన్నారు. కింద ఫ్రెండ్ షిప్, ఫ్రెండ్షిప్ అని ట్యాగ్స్ ఇచ్చారు. కాగా ఈ పోస్ట్ చూసిన అక్కినేని, లవర్‌బాయ్, ప్రిన్స్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు.
కొందరు సూపర్ ప్రిన్స్ అని అనగా.. మరికొందరు హే.. లవర్ బాయ్ చాలా రోజుల తర్వాత ఇలా కనిపిస్తున్నాడని.. ఇంకొందరు అఖిల్ సూపర్బ్ అని కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే ఒకరిద్దరు అభిమానులు మిస్ యూ తరుణ్ అన్నా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments