డైరెక్టర్‌ శంకర్‌ను ఆకట్టుకున్న మూడు సినిమాలు

  • IndiaGlitz, [Wednesday,December 09 2020]

కోలీవుడ్ స్టార్‌ డైరెక్టర శంకర్‌.. సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. కమల్‌హాసన్‌తో భారతీయుడు 2ను స్టార్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతూనే ఉంది. సెట్‌లో భారీ క్రేన్‌ ప్రమాదం జరగడంతో కొన్నిరోజుల పాటు షూటింగ్‌ను ఆపేశారు. తర్వాత కోవిడ్‌ ప్రభావం ప్రారంభం కావడంతో సినిమా మళ్లీ ఆగిపోయింది. ఇప్పుడు క్రమంగా స్టార్స్‌ అందరూ సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళుతున్నారు. కానీ.. శంకర్‌ పరిస్థితి అలా లేదు. అసలు భారతీయుడు 2పై సందేహాలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో శంకర్‌ తనకు దొరికిన ఖాళీ సమయంలో సినిమాలు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో శంకర్‌ చూసిన సినిమాల్లో మూడు సినిమాలు ఆయన్ని బాగా ఆకట్టుకున్నాయి. ఆ మూడు సినిమాల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ప్రశంసిస్తూ ట్వీట్‌ చేయడం విశేషం.

ముందుగా శంకర్‌ ఆకాశం నీ హద్దురా సినిమా గురించి ప్రస్తావిస్తూ జీవీ ప్రకాశ్‌ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారని, తన సంగీతంతో జీవీ సినిమాకు ప్రాణం పోశారని ఆయన తెలిపారు. అలాగే అంధకారం సినిమా కూడా తనకు బాగా నచ్చిందని చెప్పిన శంకర్‌.. ఆ సినిమాకు ఎడ్విన్‌ సాకే అద్భుతమైన విజువల్స్ అందించారని అన్నారు.

ఇక చివరిగా ఆస్కార్‌ రేసులో నిలిచిన మలయాళ చిత్రం జల్లికట్టు గురించి చెబుతూ ప్రశాంత్‌ పిళ్లై ఎక్స్‌ట్రార్డినరీ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చారన్నారు శంకర్‌.

More News

చాలా గ్యాప్ తరవాత తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తుండడం చాలా సంతోషంగా ఉంది!! - దర్శకుడు సుబ్బారావు గోసంగి

"అక్కడొకడున్నాడు, రాఘవరెడ్డి" చిత్రాలనంతరం ప్రముఖ నిర్మాణ సంస్థ 'లైట్ హౌస్ సినీ మ్యాజిక్' ప్రొడక్షన్ నంబర్-3తో తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తున్నారు

14న హైదరాబాద్‌కు రజినీకాంత్...

తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ రాజకీయ ఆరంగేట్రంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

బంగారు పుష్పాల గుట్టు రట్టుకు సిద్ధమైన దేవాదాయశాఖ..

శ్రీవారి బంగారు పుష్పాల గుట్టు రట్టు చేసేందుకు దేవాదాయశాఖ సిద్ధమైంది.

ఫైవ్ స్టార్ హోటల్‌లో ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య..

ప్రముఖ తమిళ టీవీ నటి వీజే చిత్ర(28) బుదవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెన్నై న‌జ‌ర‌త్ పేట్టైలోని ఓ ఫైవ్‌స్టార్ హోట‌ల్‌‌లో

వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే పొడిగింపు..

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను పాత పద్ధతిలో కొనసాగించుకోవచ్చని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.