మెగాబిమానులకు మూడు పండుగలు...

  • IndiaGlitz, [Monday,May 29 2017]

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోరి రీ ఎంట్రీ ఇవ్వ‌డంతో ఆయ‌న అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేవు. ఖైదీ నంబ‌ర్ 150 చిత్రంతో వంద కోట్ల మైలురాయిని అందుకున్న చిరంజీవి ఇప్పుడు త‌న 151వ సినిమాపై దృష్టి పెడుతున్నాడు. తెలుగు, త‌మిళంతో పాటు హిందీలో కూడా సినిమాను నిర్మించాల‌నుకోవ‌డం విశేషం. ఈ సినిమాను ఆగ‌స్టు 22న లాంఛ‌నంగా ప్రారంభిస్తున్నార‌ట‌.
చిరంజీవి పుట్టిన‌రోజు ఒక ప‌క్క‌,స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌క‌థ‌పై సినిమాను ప్రారంభించ‌డం రెండోదైతే, చిరంజీవి పుట్టిన‌రోజునే ఈ సినిమాకు చెందిన ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఇదే క‌నుక నిజమైతే మెగాభిమానులు ఓకే రోజు మూడు పండుగ‌లు జ‌రుపుకున్న‌ట్లే. మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వ‌ర్యారాయ్ పేరు ప్ర‌ముఖంగా విన‌ప‌డుతుంది. అమితాబ్ కూడా ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టించే అవ‌కాశం ఉంద‌ని కూడా అంటున్నారు. సురేంద‌ర్ రెడ్డి సినిమాను డైరెక్ట్ చేయ‌నున్నారు.

More News

తలైవా సినిమాలో నానా పటేకర్...

బాలీవుడ్లోనానా పటేకర్ కు విలక్షణ నటుడుగా చాలా మంచి పేరుంది.

అల్లు అరవింద్ తో మనస్పర్ధలు పై నోరు విప్పిన దర్శకధీరుడు

ఇప్పుడు 'బాహుబలి-2' సినిమాతో ఇండియన్ స్టార్ డైరెక్టర్ హోదా తెచ్చుకున్నాడు మన టాలీవుడ్ డైరెక్టర్,

మహేష్ అభిమానులకు ఈసారి కూడా నిరాశ తప్పదా...

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఎ.ఆర్.మురుగ దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం 'స్పైడర్'.

సందీప్ కిషన్ తో మిల్కీబ్యూటీ...

రీసెంట్ గా మానగరంతో మంచి విజయాన్ని అందుకున్న సందీప్ కిషన్,కృష్ణవంశీ నక్షత్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ది అంగ్రేజ్ టీంతో...డా. శేషు కెఎంఆర్ దర్శకుడిగా హరీష్ చంద్ర చాండక్ నిర్మిస్తున్న చిత్రం 127బి...మిషన్ ఇంపాజిబుల్

ప్లే బ్యాక్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై హరీష్ చంద్ర చాండక్ నిర్మాతగా...