మూడు రోజుల పరిణయం...
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకప్పుడు పెళ్ళి చేసుకోవాలంటే 16 రోజులు చేసుకునేవారట. ఇంటికి సంబంధించిన బంధువులనంతా పిలిచి పెళ్ళి చేసుకునేవారు. కొన్ని రోజులు తర్వాత వారం రోజుల పెళ్ళి, తర్వాత ఐదు రోజుల పెళ్ళి వరకు వచ్చింది. ఇప్పుడు ఒక రోజు పెళ్ళి వేడుకలే జరగుతున్నాయి. కొన్ని చోట్లైతే రిజిష్టర్ మార్యేజ్‌లు చేసేసుకుని రిసెప్షన్ ఇచ్చేస్తున్నారు. కానీ సినీ సెలబ్రిటీ అయిన నాగచైతన్య అంతా ఇప్పుడున్న ట్రెండ్‌కు భిన్నంగా కొత్త ట్రెండ్‌కు తెర తీశాడు.
నాగచైతన్య, సమంత మధ్య ప్రేమ కాస్తా పరిణయం వరకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రేమపక్షులు అక్టోబర్ 6న ఒకింటివారవుతున్నారు. కానీ వీరిద్దరి పెళ్ళి ఒకరోజు కాదు, ఏకంగా మూడు రోజులు జరగుతుందని వార్తలు వస్తున్నాయి. అంటే చైతు, సమంతల పెళ్ళి అక్టోబర్ 6 నుండి 8 వరకు జరుగనుందట. క్రైస్తవ, హిందూ సంప్రదాయంలో పెళ్ళి జరగుతుందట. పెళ్ళి తర్వాత 40 రోజుల పాటు న్యూయార్క్‌లో హనీమూన్ ప్లాన్ కూడా జరిగిపోయిందని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout