మూడు రోజుల పండ‌గ

  • IndiaGlitz, [Tuesday,November 28 2017]

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ క్రిస్మ‌స్ ప్ర‌త్యేకం కానుంది. ఎందుకంటే.. పండ‌గ సంద‌ర్భంలో వ‌రుస‌గా మూడు రోజుల పాటు ఆస‌క్తిక‌ర‌మైన సినిమాలు విడుద‌ల కానుండ‌డ‌మే అందుకు కార‌ణంగా చెప్పొచ్చు. ఆ మూడు చిత్రాలే.. ఎం.సి.ఎ, హ‌లో, ఒక్క క్ష‌ణం. వీటిలో ముందుగా ఎం.సి.ఎ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఆరు వరుస విజ‌యాల త‌రువాత నాని హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని స‌క్సెస్‌ఫుల్ చిత్రాల నిర్మాత‌ దిల్ రాజు నిర్మిస్తున్నారు. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌కుడు. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాని డిసెంబ‌ర్ 21న రిలీజ్ చేయ‌నున్నారు. ఆ త‌రువాత రోజు అంటే డిసెంబ‌ర్ 22న హ‌లో చిత్రం సంద‌డి చేయ‌నుంది.

అక్కినేని అఖిల్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఇష్క్‌, మ‌నం, 24 చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను సొంతం చేసుకున్న విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌కుడు. కింగ్ నాగార్జున నిర్మిస్తున్నారు.

ఇక డిసెంబ‌ర్ 23న ఒక్క క్ష‌ణం రాబోతోంది. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడాతో విజ‌యం అందుకున్న వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తుతో హిట్ అందుకున్న అల్లు శిరీష్ హీరోగా న‌టిస్తున్నాడు. మ‌రి ఈ మూడు చిత్రాల‌లో ఏ సినిమాకి ప్రేక్ష‌కులు విజ‌యాన్ని అందిస్తారో చూడాలి.

More News

6 కోట్లకు అల్లు శిరీష్ ఒక్క క్షణం ఆంధ్రా హక్కులు

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ త‌ర్వాత అల్లు శిరీష్ హీరోగా, సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి టెర్రిఫిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన చిత్ర ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ డైరెక్షన్ లో లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి నిర్

పవన్ ని ఆకాశానికెత్తేసిన కీర్తి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ సినిమా టైటిల్ ని చిత్ర యూనిట్ నిన్న కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ వారణాసిలో ఆఖరి షెడ్యూల్ జరుపుకుంటోంది.

ప్రాజెక్ట్ z.. అడ్డంకులు తొలగిపోయాయి

సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న తమిళ చిత్రం ‘మాయవన్’. ఇదొక సైన్స్ ఫిక్షన్ క్రైమ్ మిస్టరీ ఫిలిం. దీనిని ‘ప్రాజెక్ట్ z’ అనే పేరుతో తెలుగులో డబ్ చేస్తున్నారు.

అన్నయ్యని డైరెక్ట్ చేస్తానంటున్న తమ్ముడు

ఆవారా, నాపేరు శివ, ఊపిరి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ కథానాయకుడు కార్తి. ‘ఖాకి’ సినిమా విజయంతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు ఈ యువ కథానాయకుడు.

గ‌రుడ‌వేగ ఆర్టిస్ట్‌.. షార్ట్ ఫిల్మ్‌

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ విలన్ గా పేరు తెచ్చుకున్నాడు యువ న‌టుడు ఆదర్శ్ బాలకృష్ణ.యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్'లో రన్నర్ అప్ గా నిలిచాడు ఆద‌ర్శ్‌.