ఇవన్నీ పురుషాంగాలు కాదండోయ్.. అసలు విషయం తెలిస్తే..!

  • IndiaGlitz, [Friday,December 13 2019]

ఇదిగో పక్క ఫొటోలో చూడగానే ఏమనిపిస్తోంది.. ఇదేంటి పురుషాంగంలాగా ఉందని అనుకుంటున్నారు కదూ.. అది ఆకారమంతే.. కానీ పురుషాంగం కాదండోయ్.. పొరపాటున అలా అనుకుంటే తప్పులో కాలేసినట్లే.!. ప్రస్తుతం ఈ ఆకారంలో ఉండే చిత్రాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అసలేంటిది..? ఎక్కడివి ఇవన్నీ అని ఆరా తీయగా షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. అసలు సంగతేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం!

పురుషాంగం కాదండోయ్.. పెనిస్ ఫిష్!
వాస్తవానికి ఇది పురుషాంగం‌ను పోలిన ఒక సముద్రపు జీవం.. అమెరికాలోని కాలిఫోర్నియా సముద్ర తీరంలో ఇలాంటివి వేల సంఖ్యలో ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఈ జీవులు చూడటానికి అచ్చంగా పురుషాంగంలా ఉండటంతో వీటిని చూసిన జనాలు మొదట కాస్త తికమకపడ్డా.. అసలు విషయం తెలిసే సరికి అవునా.. అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సముద్రపు జీవిని అక్కడి పరిభాషలో ‘పల్సింగ్ పెనిస్ ఫిష్’ అని అంటారు. ఈ జీవి.. పది ఇంచుల పొడవుతో ఉండి సముద్రంలో కొన్ని అడుగుల కింది భాగంలో జీవిస్తుందని పరిశోధకులు, కథనాలు చెబుతున్నాయి. వీటినే ‘ఫాట్ ఇన్ కీపర్ వార్మ్’ అని కూడా పిలుస్తారు. అయితే.. కాలిఫోర్నియా వాళ్లు మాత్రం స్థానికంగా ‘పెనిస్ ఫిష్’ అని సింపుల్‌గా పిలుచుకుంటారు.

ఎలా బయటికొచ్చాయ్!?
కాలిఫోర్నియా ఇటీవల తుఫాను వచ్చింది. దీంతో సముద్ర తీరంలో బలమైన అలలు రావడంతో సముద్రపు అడుగున ఉన్న ఈ జీవులు వేల సంఖ్యలో ఒడ్డుకు వచ్చాయి. ఈ విషయాన్ని పలువురు సోషల్ మీడియాలో చెప్పగా.. ‘ది న్యూయార్క్ పోస్ట్’ అనే మీడయా సంస్థ అసలు విషయాన్ని బయటపెట్టింది. ఈ కథనం ప్రకారం ఈ పెనిస్ ఫిష్‌లు సముద్రంలోని బాక్టీరియా, నాచు పదార్థాలను భుజిస్తాయట. కాగా ఈ జీవులను అమెరికాలో కంటే ఎక్కువగా చైనాలో భుజిస్తుంటారు. అంతేకాదు.. నిత్యావసర వస్తువుగా అన్ని వంటల్లోనూ వాడేస్తుంటారట.

నవ్వుకున్నా.. ఇది రెగ్యులరే!
ఈ జీవులు అమెరికాలోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. దాదాపు 300 మిలియన్ సంవత్సరాలుగా ఇవి సముద్ర తీరంలో జీవనం కొనసాగిస్తున్నాయి. వీటి ముందుభాగంలో ఉండే మ్యూకస్ ద్రవం ద్వారా సముద్రంలో తేలియాడే చిన్న చిన్న నాచు మొక్కలు, క్రిములను తింటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వార్తలు ఇండియాలో జనాలు చూడటానికి మనం నవ్వు.. కాస్త అసహ్యంగా అనిపించినా.. అమెరికా, చైనాలో మాత్రం రెగ్యులర్ వంటకాల్లో తెగవాడేస్తుంటారట. అంటే.. మనకు చికెన్, మటన్ ఎలాగో అక్కడ.. వారికి పెనిస్ ఫిష్‌లు అలా అన్నమాట.

More News

ఇది పాట కాదు.. మా ఎమోష‌న్ అంటున్న నితిన్‌

`శ్రీనివాస క‌ల్యాణం` త‌ర్వాత ఏడాది పాటు ఖాళీగా ఉన్న నితిన్ ఇప్పుడు మూడు సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు.

సిక్స్ ప్యాక్ లుక్ లో సాయితేజ్

తెలుగునాట సిక్స్ ప్యాక్ ఓ ట్రెండ్‌గా మారింది. ఇప్పుడు ఈ జాబితాలో మెగాహీరో సాయితేజ్ కూడా చేరాడు.

5 జీవితాల కథనమే 'జోహార్'

ధర్మ సూర్య పిక్చర్స్ పతాకంపై పొలిటికల్ సెటైర్‌గా రూపొందుతోన్న ఎమోషనల్ డ్రామా ‘జోహార్’.

'రాం రాం' పాట 'ఊల్లాల ఊల్లాల' చిత్రానికే హైలైట్ గా నిలుస్తుంది - నిర్మాత ఏ . గురురాజ్

సీనియర్ నటుడు సత్యప్రకాష్  దర్శకత్వంలో సుఖీభవ మూవీస్ పతాకంపై 'లవర్స్ డే'  ఫేమ్ ఎ.గురురాజ్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం "ఊల్లాల ఊల్లాల".

జగన్‌ సర్కార్‌ కూలిపోతుంది..: పవన్ జోస్యం

‘రైతు సౌభాగ్య దీక్ష’ పేరిట కాకినాడలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ఒక రోజు నిరసన దీక్ష ముగిసింది.