పిల్లి వల్ల అక్షరాలా 100 కోట్ల నష్టం.. లబోదిబోమంటోన్న జనం, ఎక్కడో కాదు ఇండియాలోనే
Send us your feedback to audioarticles@vaarta.com
మియావ్ మియావ్ అనుకుంటూ ఎలుకలు పట్టుకోవడానికి ఇళ్లలోకి దూరి.. సామాన్లన్నీ చిందర వందర చేసే పిల్లి అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. కొందరు ఈ అల్లరికి ముచ్చటపడితే.. ఇంకొందరు మాత్రం దానిని తిట్టుకుంటూ వుంటారు. అయితే మహారాష్ట్రలో ఒక పిల్లి కారణంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అంత చిన్న పిల్లి వల్ల ఇంత నష్టమా అని మీరు అనుకోవచ్చు కానీ ఇది నిజం.
పుణెలోని పింప్రి చించ్వాడ్లో జరిగింది ఈ ఘటన. భోసరీ, భోసరీ ఎంఐడీసీ, ఓకుర్ది ప్రాంతాలకు ఒక్కసారిగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఏకంగా 60 వేల మంది వినియోగదారులు.. అంధకారంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో 7 వేల వ్యాపార సముదాయాలకు పవర్ కట్ అయింది. పింప్రిలోని భోసారి పారిశ్రామిక ప్రాంతంలో 220 కేవీ సబ్ స్టేషన్ లో ట్రాన్స్ఫార్మర్ ఎక్కింది ఓ పిల్లి.. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ పిల్లి చనిపోయింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
అది ఇండస్ట్రీయల్ ఏరియా కావడంతో పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. దీంతో వ్యాపారులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పవర్ కట్ ద్వారా తమ వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, సుమారు వంద కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆరోపిస్తోంది పింప్రి-చించ్వడ్ స్మాల్ కేర్ ఇండస్ట్రీస్ సంఘం. ఈ అంశంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి సమస్యను వీలైనంత తొందరగా తీర్చాలని డిమాండ్ చేశారు. అయితే ఈ పవర్ కట్ మరో మూడు రోజుల వరకు కొనసాగవచ్చంటున్నారు అధికారులు. ప్రజలు విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని, లేని పక్షంలో ఒకే ట్రాన్స్ఫార్మర్పై లోడ్ మొత్తం పడుతుందంటుని చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments