చిరంజీవిగారి ఆ మాటలే నన్ను నటుడిని చేశాయి: పవన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రి రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం శిల్ప కళావేదికలో వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో పవన్ మాట్లాడిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అభిమానులను తన గుండె చప్పుడుతో పోల్చడంతో అభిమానులు ఆనందంతో ఊగిపోయారు. బండ్ల గణేష్‌లా తాను మాట్లాడలేనని పొలిటికల్ సభ అయితే మాట్లావచ్చు కానీ ఇక్కడ మాట్లాడటం సబబు కాదన్నారు. మూడు సంవత్సరాలు సినిమాలు చేయలేదన్న భావన తనకు కలగలేదన్నారు. సినిమాల్లోకి వచ్చి తాను 24 ఏళ్లు అయిపోయిందంటే తెలియలేదన్నారు.

పని చేసుకుంటూ వెళ్లిపోయానని తనకు అదేమీ తెలియలేదన్నారు. ఇంకా పవన్ మాట్లాడుతూ.. ‘‘దిల్‌ రాజు వంటి ప్రొడ్యూసర్ తనతో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. కలలు కనే వారిని చాలా ఇష్టపడతాను. నా కోసం సినిమాలు చేయండని ఎవరినీ అడగలేదు. మా అన్నయ్య చిరంజీవి గారు అన్న మాట నటుడిని చేసింది. ‘నీకు చిరంజీవి వంటి అన్నయ్య ఉండి.. నీపై ఆధారపడే కుటుంబ సభ్యులు లేరు. ఇవి కాకుండా నువ్వొక నటుడై.. ఇదే స్పిరిట్యువాలిటీ గురించి మాట్లాడగలవా?’ అన్న చిరంజీవిగారి మాటలే నన్ను నటుడిని చేసింది.

నేను ఇంటర్ ఫెయిల్ అయి చదువును వదిలేసిన వ్యక్తిని. నాకు తెలిసిన మొదటి వకీలు నాని పాల్కివాలా. ఎమర్జెన్సీ టైంలో మానవ హక్కుల ఉల్లంఘన కోసం బలంగా వాదించిన వ్యక్తి. అప్పటి నుంచి ఆ వృత్తిపై నాకు చాలా గౌరవం ఉండేది. ప్రకాష్ రాజ్ గారికి, నాకూ పొలిటికల్‌గా విభిన్నమైన దారులుండొచ్చు కానీ సినిమా పరంగా మేమంతా ఒక్కటే. ఛానల్స్‌లో నా గురించి ఏమైనా మాట్లాడితే నాకేం ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అది ఆయన అభిప్రాయం. కానీ సినిమా పరంగా ఆయనంటే నాకు చాలా ఇష్టం’’ అని పవన్ పేర్కొన్నారు. అలాగే సినిమాలో చేసిన ప్రతి ఒక్కరి గురించి వివరించారు.

More News

‘వకీల్ సాబ్’ వేదికగా ఆసక్తికర విషయం వెల్లడించిన హరీష్ శంకర్

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘వకీల్ ‌సాబ్’.ఈ సినిమా ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

పవన్‌కు పొగరు.. ఎంత పొగరంటే.. : రెచ్చిపోయిన బండ్ల గణేష్

బండ్ల గణేష్.. నిన్న మొన్నటి వరకూ చూసిన వ్యక్తి వేరు.. ఆదివారం సాయంత్రం చూసిన వ్యక్తి వేరు.

ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. రీమేక్ కోసం గాయకుడిగా పవన్

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఇది నిజంగా గుడ్ న్యూస్. ఆయన తన అభిమానులను మరోసారి ఫిదా చేసేందుకు సిద్ధమవుతున్నారు.

పెళ్లి వేడుకలో 86 మందికి కరోనా.. తెలంగాణలో మళ్లీ విజృంభణ

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఇటీవలి కాలంలో కేసులు గణనీయంగా తగ్గిపోవడంతో జనాలు కూడా సేఫ్టీ ప్రికాషన్స్ పక్కనబెట్టేశారు.

ప్రభాస్‌ - లోకేష్‌ కనగరాజ్‌ కాంబోలో చిత్రానికి సన్నాహాలు?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ తరువాత ఫఉల్ జోష్ మీద ఉన్నారు.