Chiranjeevi: ఆ మాటలు అసహ్యంగా వున్నాయి.. త్రిషకి అండగా నిలబడతా: చిరంజీవి

  • IndiaGlitz, [Tuesday,November 21 2023]

అగ్ర కథానాయిక త్రిషపై కోలీవుడ్ సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై పరిశ్రమలకు అతీతంగా అందరూ స్పందిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ లిస్టులో చేరారు. త్రిష గురించి మన్సూర్ అలీఖాన్ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని, ఇవి కేవలం సినీ కళాకారులకు మాత్రమే కాకుండా ఏ మహిళకైనా అసహ్యంగా వుంటాయని చిరు పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలని.. వక్రబుద్ధితో కొందరు కొట్టుమిట్టాడుతున్నారని, కేవలం త్రిష ఒక్కరే కాకుండా ఇలాంటి వ్యాఖ్యలకు బాధితులుగా మారిన ప్రతి మహిళకు తాను అండగా నిలుస్తానని మెగాస్టార్ హామీ ఇచ్చారు.

ఇంతకీ మన్సూర్ అలీఖాన్ ఏమన్నారంటే:

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మన్సూర్ అలీఖాన్.. విజయ్ నటించిన లియో మూవీ గురించి తన అభిప్రాయాలు పంచుకున్నారు. లియోలో త్రిష నటిస్తున్నారని తెలిసి ఆమెతో ఒక్క బెడ్‌రూమ్ సీన్ అయినా వుంటుందని అనుకున్నానని కామెంట్ చేశారు. తన గత సినిమాల మాదిరిగానే త్రిషను కూడా బెడ్‌రూమ్‌కి తీసుకెళ్లొచ్చని అనుకున్నానని.. కానీ అలా జరగలేదని మన్సూర్ ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో తాను నటించిన చాలా సినిమాల్లో రేప్ సీన్లు చేశానని. అవి తనకు కొత్త కాదని , అసలు కాశ్మీర్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్‌లో త్రిషను తనకు కనీసం చూపించలేదని వ్యాఖ్యానించారు. దీనిపై సినీ ప్రపంచం ముఖ్యంగా మహిళా కళాకారులు భగ్గుమన్నారు.

ఈ వివాదంపై త్రిష స్వయంగా స్పందించారు. మన్సూర్ అలీఖాన్ తన గురించి నీచంగా మాట్లాడిన వీడియో తన దృష్టికి వచ్చిందని .. దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అతనిలాంటి నటుడితో ఇప్పటి వరకు స్క్రీన్ షేర్ చేసుకోనందుకు తాను అదృష్టవంతురాలినని, మిగిలిన తన నట జీవితంలో ఆయన నా సినిమాలో లేకుండా చూసుకుంటానని త్రిష తేల్చిచెప్పారు. మన్సూర్ అలీఖాన్ లాంటి వారి వల్ల మానవజాతికే చెడ్డపేరు వస్తుందని త్రిష రాసుకొచ్చారు.

More News

YS Jagan: వర్షాల కారణంగా సీఎం జగన్ సూళ్లూరుపేట పర్యటన రద్దు

ఏపీ సీఎం జగన్ తిరుపతి జిల్లా పర్యటన రద్దైంది. మత్స్యకార దినోత్సవం సందర్భంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయాల్సి ఉంది.

Bigg Boss Telugu 7: ప్రశాంత్, గౌతమ్ మధ్య 'పంచె' పెట్టిన చిచ్చు.. అశ్విని షాకింగ్ డెసిషన్

బిగ్‌బాస్ 7 తెలుగు ఉత్కంఠగా సాగుతోంది. ఈ ఆదివారం నో ఎలిమినేషన్ అంటూ నాగార్జున షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరు దక్కించుకోకపోవడంతో ఈ

IT Raids: మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటీ దాడులు.. కార్యకర్తలు ఆందోళన

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీల నేతలకు ఐటీ దాడులు కలవరం పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఎవరి ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తారనే భయంతో ఉన్నారు.

Chandrababu: చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంకోర్టుకు సీఐడీ అధికారులు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Telangana Elections: తనిఖీల్లో రూ.1760కోట్లు పట్టివేత.. తెలంగాణలోనే అత్యధికం..

ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నగదు, మద్యం ఏరులైపారుతోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్నారు.