మహేష్ మూవీకి అంత మంది నిర్మాతలా..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ హీరోగా క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు, తమిళ్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి దాదాపు 100 కోట్లు బడ్జెట్ అవుతుంది.
అయితే...ఈ భారీ బడ్జెట్ మూవీ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేమిటంటే... నిర్మాత ఎన్.వి.ప్రసాద్ తో పాటు లియో ప్రొడక్షన్, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, మహేష్ బాబు నిర్మాణ సంస్థ ఎం.బి ఎంటర్ టైన్మెంట్, మురుగుదాస్ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయని సమాచారం. మొత్తం ఐదు భారీ నిర్మాణ సంస్థలు కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్నినిర్మిస్తుండడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments