ఏపీకి వచ్చిన ఆ 185 మందికి కరోనా లేదు!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వైరస్ మూలంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను కేంద్రం సహాయంతో స్వదేశానికి రప్పించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా మలేషియా రాజధాని కౌలాలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకొన్న సుమారు 150 మంది తెలుగు విద్యార్థులు బుధవారం నాడు ఏపీలోని విశాఖకు క్షేమంగా వచ్చారు. వాళ్ల రాకతో ఒక్కసారికి జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజానీకం భయంతో వణికిపోయింది. విదేశాల నుంచి రావడంతో వారికి కరోనా ఉందేమో..? ఒకవేళ ఉంటే ఎక్కడ మనకు సోకుతుందో..? అని జనాలు బెంబేలెత్తిపోయారు. అయితే ఇలా అనుమానాలు, అపోహాలపై ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజకిశోర్ మీడియాతో మాట్లాడి క్లారిటీ ఇచ్చారు.
టెస్ట్‌లు చేశాం.. ఎవరికీ లేదు!
‘కౌలాలంపూర్ నుంచి 185 మంది విద్యార్థులు వచ్చారు. వాళ్లంతా ఆరోగ్యంగానే ఉన్నారు. వీరిలో ఏపీకి చెందిన వారు 91 మంది, తెలంగాణకు చెందిన వారు 10మంది, తమిళనాడుకు చెందిన వారు 77మంది, కేరళకు చెందిన వారు ఇద్దరు, కర్ణాటకకు చెందిన ఒక్కరు, మహరాష్ట్రకు చెందిన వారు ముగ్గురు, ఒరిస్సాకు చెందిన వారు ఒక్కరు ఉన్నారు. వీరందరికీ పరీక్షలు చేశాం. ఎవరికీ కరోనా లక్షణాలు లేకపోవడంతో అందర్నీ ఇంటికి పంపుతున్నాము’ అని రాజకిశోర్ మీడియాకు వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com