'తొలి ప్రేమ' వాయిదా పడనుందా?

  • IndiaGlitz, [Saturday,December 23 2017]

తొలిప్రేమ‌.. తెలుగు తెర‌పై సంచ‌ల‌నం సృష్టించిన ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా ఎ.కరుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ క్యూట్ ల‌వ్‌స్టోరీ ప్రేమ‌క‌థా చిత్రాల‌లో చెర‌గ‌ని సంత‌కం చేసింది. ఇప్పుడు ఇదే టైటిల్‌తో మ‌రో సినిమా రానుంది. మెగా ఫ్యామిలీకి చెందిన క‌థానాయ‌కుడే ఈ చిత్రాన్ని చేస్తుండ‌డం విశేషం. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది.

నూత‌న ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని టేకాఫ్ చేస్తున్నాడు. యువ సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా వాయిదా ప‌డే అవ‌కాశ‌ముంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అదే రోజున సాయిధ‌ర‌మ్ తేజ్‌, వి.వి.వినాయ‌క్‌ల చిత్రంతో పాటు మ‌రో నాలుగు చిత్రాలు కూడా విడుద‌ల కానుండ‌డంతో ఇప్పుడు తొలి ప్రేమ రిలీజ్‌ని వాయిదా వేసుకున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ వ‌స్తుంది.

More News

హీరోకి తల్లి పాత్రలో మీనా

తొలుత బాలనటిగా తెరంగేట్రం చేసి..తరువాత కాలంలో కథానాయికగానూ రాణించారు మీనా.

శ్రీను వైట్ల చిత్రంలో..

హాస్య నటుడిగా కెరీర్ ని ప్రారంభించి..క్రమంగా కథానాయకుడి పాత్రలవైపు అడుగులు వేశారు సునీల్.

'సప్తగిరి ఎల్.ఎల్.బి' చిత్రాన్ని వీక్షించిన పార్లమెంట్ సభ్యులు

'సప్తగిరి ఎక్స్ ప్రెస్'వంటి సూపర్హిట్ చిత్రం తర్వాత సప్తగిరి హీరోగా నటించిన చిత్రం 'సప్తగిరి ఎల్.ఎల్.బి'

'ఇగో' ఆడియో విడుదల

'ఆకతాయి'ఫేమ్ ఆశిష్ రాజ్,సిమ్రాన్ జంటగా రూపొందుతోన్న సినిమా 'ఇగో'.

'బేవర్స్' చిత్రం టీజర్ గ్రాండ్ లాంచ్

'ఆనలుగురు','మీ శ్రేయాభిలాషి'లాంటి గర్వించదగ్గ చిత్రాల్లొ నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని రెండింతలు సొంతం చేసుకున్న నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారు ముఖ్య పాత్రలో నటించిన చిత్రం బేవర్స్.