ఒకరోజు ఆలస్యంగా 'తొలిప్రేమ'
Send us your feedback to audioarticles@vaarta.com
వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం `తొలిప్రేమ`. బివిఎస్ఎన్.ప్రసాద్ నిర్మాత. వెంకీ అట్లూరి దర్శకుడు. ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదలవుతుందని నిర్మాతలు ముందుగా ప్రకటించారు. అయితే అదే రోజున మరో మెగా హీరో వరుణ్‌తేజ్ `ఇంటిలిజెంట్` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
దీంతో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలిద్దరూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం ఎందుకని అనుకున్నారేమో కానీ..తొలిప్రేమ నిర్మాత బివిఎస్ఎన్.ప్రసాద్ పూనుకుని తమ సినిమాను ఒకరోజు ఆలస్యంగా విడుదల చేయాలనుకున్నారు. అంటే ఈ సినిమా ఫిబ్రవరి 10న విడుదలకానుంది. అయితే ఓవర్ సీస్ విషయంలో మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేదు. అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయాన్ని బట్టే `తొలిప్రేమ` రిలీజ్ ఉంటుందట. లేదంటే అనుకున్నట్లే ఫిబ్రవరి 9నే విడుదలవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments