ఒకరోజు ఆలస్యంగా 'తొలిప్రేమ'

  • IndiaGlitz, [Wednesday,January 31 2018]

వ‌రుణ్‌తేజ్‌, రాశీఖ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం 'తొలిప్రేమ‌'. బివిఎస్ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత‌. వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల‌వుతుందని నిర్మాత‌లు ముందుగా ప్ర‌క‌టించారు. అయితే అదే రోజున మ‌రో మెగా హీరో వ‌రుణ్‌తేజ్ 'ఇంటిలిజెంట్‌' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

దీంతో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలిద్ద‌రూ బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డ‌టం ఎందుక‌ని అనుకున్నారేమో కానీ..తొలిప్రేమ నిర్మాత బివిఎస్ఎన్‌.ప్ర‌సాద్ పూనుకుని త‌మ సినిమాను ఒక‌రోజు ఆల‌స్యంగా విడుద‌ల చేయాల‌నుకున్నారు. అంటే ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 10న విడుద‌లకానుంది. అయితే ఓవ‌ర్ సీస్ విష‌యంలో మాత్రం ఏ నిర్ణ‌యం తీసుకోలేదు. అక్క‌డి డిస్ట్రిబ్యూట‌ర్స్ నిర్ణ‌యాన్ని బ‌ట్టే 'తొలిప్రేమ' రిలీజ్ ఉంటుంద‌ట‌. లేదంటే అనుకున్న‌ట్లే ఫిబ్ర‌వ‌రి 9నే విడుద‌ల‌వుతుంది.