'తొలి ప్రేమ' దర్శకుడి ఖాతాలో రెండు చిత్రాలు
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాహీరో వరుణ్ తేజ్, రాశిఖన్నా నాయకానాయికలుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'తొలిప్రేమ'. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సర్వత్రా హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమాతో.. దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు వెంకీ అట్లూరి.
అంతేగాకుండా, ఈ బ్యూటీఫుల్ లవ్ స్టోరీని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించిన ఈ దర్శకుడి కోసం ఇప్పటికే రెండు ఆఫర్లు ఎదురుచూస్తున్నాయని సమాచారం. వెంకీ పనితనం నచ్చి తదుపరి సినిమాని కూడా తన సంస్థలోనే తెరకెక్కించే అవకాశం ఇచ్చారట బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్.
అలాగే..'తొలిప్రేమ' థియేట్రికల్ హక్కుల్ని సొంతం చేసుకున్న దిల్ రాజు కూడా ఒక అవకాశాన్ని ఈ యంగ్ డైరెక్టర్ కిచ్చినట్టు తెలిసింది. ఈ మూవీ వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాలకి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com