ఈసారి ఖైరతాబాద్ గణపతి ఒక్క అడుగే..!

  • IndiaGlitz, [Wednesday,May 13 2020]

తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేశ్‌కు ప్రత్యేక స్థానం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రూపంలో ఏటికేడు కొత్తదనం సంతరించుకుంటూ కనువిందు చేసే ఈ భారీ గణేశుడిని చూడటానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు విచ్చేస్తుంటారు. వినాయక చవితి వచ్చిందంటే చాలు భారీగా క్యూలైన్లు కనిపిస్తుంటాయి. అయితే ఈ ఏడాది ఆశించినంతగా జనం రాలేరేమో.. ఎందుకంటే కరోనా భయం నుంచి ఇంకా ప్రజలు బయటపడలేదు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఏడాది అడుగులు పెంచుకుంటూ వెళ్లే ఉత్సవ కమిటీ.. ఈసారి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా నిర్ణయం తీసుకుంది. కేవలం ఒక్కటంటే ఒక అడుగు ఎత్తులోనే గణపయ్య విగ్రహం ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇదే జరిగితే చరిత్రలో ఫస్ట్ టైమ్..!

కాగా.. ఈ నెల 18న సాయంత్రం 5గంటలకు కర్రపూజ ప్రారంభం కానుంది. ఆగస్ట్ 22న వినాయక చవితి జరగనుంది. అయితే కర్ర పూజ రోజునే వినాయకుడి ఎత్తుపై కమిటీ ప్రకటన చేస్తుందని తెలియవచ్చింది. 1954లో తొలిసారిగా ఖైరతాబాద్‌ గణేష్ కొలువుదీరిన విషయం విదితమే. తొలిసారి కావడంతో అప్పుడు ఒకే ఒక్క అడుగు ఎత్తుతో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ తర్వాత ఏడాదికి ఒక అడుగు చొప్పున వినాయకుడి ఎత్తును పెంచుతూ వచ్చారు. అలా 60 ఏళ్లు వచ్చేసారికి ఖైరతాబాద్ గణనాథుడి ఎత్తు 60 అడుగులకు చేరింది. గతేడాది 61 అడుగుల ఎత్తులో ఏర్పాటయ్యింది. ఇదిలా ఉంటే.. కోటి రూపాయలతో రూపుదిద్దుకున్న గణేశుడి కోసం 100 మందికి పైగా కళాకారులు నాలుగు నెలలు కష్టపడి తయారు చేస్తుంటారు. ఒక్క అడుగు అనేది నిజమే అయితే.. చరిత్రలో ఇదే తొలిసారి. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారికంగా ఉత్సవ కమిటీ నుంచి అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.

More News

'కరోనా' లాక్ డౌన్ 4.0పై తేల్చేసిన మోదీ..!

కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. మరీ ముఖ్యంగా ఇండియాలో అయితే రోజురోజుకూ కరోనా కేసులు, అనుమానితులు, మరణాలు పెరిగిపోతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు.

కష్టకాలంలో 20 లక్షల కోట్ల ప్యాకేజి ప్రకటించిన ప్రధాని

కరోనా కష్టాల్లో ఉన్న భారతీయులను ఆదుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. రూ.20 లక్షల కోట్లతో ‘ఆత్మ నిర్భర్ అభియాన్’ పేరుతో కొత్త ఆర్థిక ప్యాకేజీ

జాతినుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీ కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ పరిణామాలపై జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ 8 గంటలకు మాట్లాడిన ఆయన.. ప్రాణాలు కాపాడుకుంటూ

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ 168 రిలీజ్ డేట్‌!!

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ 168వ చిత్రం ‘అణ్ణాత్త‌’ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. తెలుగులో ద‌రువు, శంఖం, శౌర్యం చిత్రాల‌తో పాటు త‌మిళంలో వివేగం, విశ్వాసం

ప్రేయ‌సి ఫొటో షేర్ చేసి షాకిచ్చిన రానా!!

టాలీవుడ్ హీరో రానా ద‌గ్గుబాటి ఈరోజు త‌న స్నేహితుల‌కు, అభిమానుల‌కు పెద్ద షాకే ఇచ్చాడు. ఇంత‌కూ రానా ఇచ్చిన షాకేంటో తెలుసా? ఓ అమ్మాయితో దిగిన ఫొటోను షేర్ చేసిన రానా ఆమె ఓకే చెప్పింది