బిగ్‌బాస్ 5 తెలుగు: ఈ వారం వరస్ట్ పెర్ఫామర్ గా జైలుకెళ్లిందెవరంటే…?
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 5 తెలుగు ఐదో వారం ఎండింగ్‌కు వచ్చేసింది. ఇప్పటికే బొమ్మల టాస్క్‌తో ఇంటి సభ్యుల మధ్య వివాదం రచ్చకెక్కింది. ప్రియా బూతులు, యానీ మాస్టర్- శ్వేతా ఫైట్ ఎలా నడిచిందో చూశారు. ఇక అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్లు చరిత్రలో లేంటూ రజనీకాంత్ ఆనాడే చెప్పాడంటూ సన్నీ ఈ రోజు డైలాగ్స్‌తో రెచ్చిపోయాడు. ఈ రోజు బిగ్‌బాస్ కొన్ని టాస్క్‌లు ఇచ్చారు. మరి వాటిలో గెలిచిందెవరో..?ఈ వారం వరెస్ట్ పర్ఫార్మర్ ఎవరో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ గురించి చదివేయాల్సిందే.,
బిగ్ బాస్ 40వ రోజు...'నాయిరే నాయిరే' సాంగ్‌పై కంటెస్టెంట్స్ డ్యాన్స్ చేశారు. అనంతరం బెస్ట్, వరస్ట్ పెరఫామెన్స్ పై ప్రియ, రవి, శ్రీరామ్ ఓ వైపు... సన్నీ, మానస్, కాజల్ మరోవైపు ముచ్చట్లు పెట్టుకున్నారు. అటు కిచెన్లో రైస్ ఉడుకుతుండగా శ్వేత హాట్ వాటర్ పెట్టుకుని తిరిగి రైస్ పెట్టడం మరిచిపోయింది. దీనిని గుర్తించిన ప్రియ ఈ విషయం ఆమెకు చెప్పడంతో శ్వేత తప్పును కప్పిపుచ్చుకునేందుకు గద్దించింది. దీంతో ఇద్దరి మధ్యా కాసేపు వాదన జరిగింది. అన్నింటికి రియాక్ట్ అయితే తాను కూడా రియాక్ట్ అవుతానని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు ప్రియాంక మైక్ పెట్టుకోవడం మర్చిపోవడంతో కెప్టెన్ విశ్వ ఆమె ఈ రోజు రాత్రివరకు మానస్‌తో మాట్లాడకూడదని పనిష్మెంట్ ఇచ్చింది. అయిష్టంగానే ఈ శిక్షను అంగీకరించిన పింకీ మానస్‌తో సైగల ద్వారా మాట్లాడింది.
ఆ తర్వాత 'పగలగొట్టినవారిదే పండగ'; అనే లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. ఈ టాస్కులో భాగంగా పలు గేమ్స్ ఆడించాడు. అయితే షణ్ముఖ్.. గేమ్ మొదలవకముందే తాను తప్పుకుంటున్నట్లు చెప్పి తోటి కంటెస్టెంట్లకి షాకిచ్చాడు. కానీ తర్వాత మాత్రం ఆట ఆడక తప్పలేదు. యాపిల్స్‌తో టవర్ కట్టే టాస్కులో శ్వేత ప్రియాంకను ఓడించగా ఆమె పగలగొట్టిన కుండలో మటన్ వచ్చింది. గోటీలను స్కేలుకు ఒకవైపు నుంచి మరోవైపుకు చేర్చే గేమ్‌లో కాజల్ ప్రియను ఓడించింది. ఆమె పగలగొట్టిన పిగ్గీ బ్యాంక్‌లో రవ్వ అనే ఐటమ్ ఉంది. చాప్‌స్టిక్స్‌తో బాల్స్ గీతకు అవతల వేయాలన్న గేమ్‌లో లోబో, యానీ పాల్గొనగా.. లోబో గెలిచి కుండ పగలగొట్టగా అందులో పన్నీర్ వచ్చింది. స్ట్రాతో జెమ్స్ ప్లేటులో వేసే గేమ్‌లో రవి గెలవగా అతడు పగలగొట్టిన కుండలో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నట్లు తేలింది. ముక్కుతో దూది తీయాల్సిన గేమ్‌లో షణ్నును ఓడించి విశ్వ గెలిచాడు. అతడు పగలగొట్టిన పిగ్గీబ్యాంక్‌లో కాఫీ వచ్చింది.
అనంతరం ప్రియాంక వచ్చి నాకు ప్రపోజ్ చేయాల్సివస్తే ఎలా చేస్తావు? అని జెస్సీని అడిగింది. అతడు నేను చెయ్యను అని కుండబద్ధలు కొట్టి చెప్పాడు. అక్కడే వున్న షణ్ణు ఊరుకోకుండా.. ఒకవేళ చెయ్యాల్సి వస్తే సచ్చిపోతాడు, కానీ చెయ్యడు అని కౌంటరిచ్చాడు . అయినప్పటికీ వదలని పింకీ.. తనను సిరి అనుకుని ప్రపోజ్ చేయమంది. చేస్తే సిరికే చేస్తానంటూ పంచ్ ఇచ్చాడు జెస్సీ. ఇది విన్న షణ్ను.. ఆమె నీకు ఏ యాంగిల్‌లో నచ్చిందిరా అంటూ జోకేయడంతో సిరి కంటతడి పెట్టింది.
ఆ తర్వాత ఈ వారం వరస్ట్ పర్ఫామర్‌ను ఎన్నుకోవాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించాడు. కంటెస్టెంట్స్‌లో ఎవరిని జైలుకు పంపాలనుకుంటున్నారో వారి టీ షర్ట్ మీద స్టాంప్ వేయాల్సి ఉంటుందని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాడు. దీంతో తొలుత ప్రియాంక సింగ్, ప్రియ, షణ్ముక్, లోబో ఈ నలుగురు వరస్ట్ పెర్ఫామర్‌గా శ్వేత పేరు చెప్పారు. విశ్వ, కాజల్ ఇద్దరూ వరస్ట్ పెర్ఫామర్ గా రవి టీషర్ట్ పై స్టాంప్ వేశారు. సన్నీ, మానస్...సిరిని, శ్రీరామ్, సిరి...యానీ మాస్టర్ ని, యానీ, శ్వేత, జస్వంత్....లోబోని, రవి...జస్వంత్‌ని వరస్ట్ పెర్ఫామర్‌గా సెలక్ట్ చేసుకుని వారి వారి టీషర్ట్స్ పై స్టాంప్స్ వేశారు. అందరిలోకీ ఎక్కువ స్టాంప్స్ పడిన శ్వేత జైలుకెళ్లింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments