ఈవారం సినిమాలు వాయిదా..?

  • IndiaGlitz, [Wednesday,November 09 2016]

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రం ఈనెల 11న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అలాగే అల్ల‌రి న‌రేష్ న‌టించిన తాజా చిత్రం ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం. ఈ చిత్రాన్ని ఈనెల 12న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. అయితే...ప్ర‌ధాని మోడీ 500, 1000 నోట్లును ర‌ద్దు చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. బ్లాక్ మ‌నీ అరిక‌ట్టేందుకు తీసుకున్న ఈ నిర్ణ‌యం వ‌ల‌న సామాన్య జ‌నం ఇబ్బందులు ప‌డుతున్నారు.
అయితే....ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌నం సినిమా చూడ‌డం అంటే కాస్త ఇబ్బందే. ఎందుకంటే చూడాలి అని ఉన్నా...చేతిలో డ‌బ్బులు ఉండ‌వు. అందుచేత ఈవారం సినిమాలు రిలీజ్ చేస్తే...క‌లెక్ష‌న్స్ పై త‌ప్ప‌కుండా ప్ర‌భావం ఉంటుంది. అందుచేత సాహ‌సం శ్వాస‌గా సాగిపో, ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం చిత్రాల రిలీజ్ విష‌యంలో ఈ చిత్ర నిర్మాత‌లు ఆలోచన‌లో ప‌డ్డార‌ని స‌మాచారం.