OTT Releases : ఓటీటీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్.. ఐదు చిత్రాలు స్ట్రీమింగ్, ఆ మూవీ పైనే చూపు
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా తర్వాత వ్యవస్థలో చెప్పలేనన్ని మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం కొందరికే పరిమితమని అనుకుంటున్న వేళ .. ప్రభుత్వోద్యోగులు కూడా ఇంటి నుంచే పనిచేశారు. అలాగే డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ కొనుగోళ్లు పెరిగాయి. విద్యా వ్యవస్థలోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగం వినోద పరిశ్రమ. అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్లకు పరిగెత్తేవారు ప్రేక్షకులు. అయితే ఆ సమయంలో ఓటీటీ మార్కెట్ వేగంగా విస్తరించింది. చాలా తక్కువ మొత్తం సబ్స్క్రిప్షన్ ఫీజులకే ప్రపంచ నలుమూలలా వున్న అన్ని రకాల వినోదం అరచేతిలోకి వచ్చి చేరింది. దీంతో ఎంతో కంటెంట్ వుంటే తప్పించి థియేటర్ వైపు కన్నెత్తి చూడటం లేదు ప్రేక్షకులు. దీంతో ప్రతి వారం ఓటీటీలో ఏమేం రిలీజ్ అవుతున్నాయో ప్రత్యేకంగా ప్రకటిస్తున్నారు మేకర్స్.
కాంతారా కోసం ఓటీటీ ప్రేక్షకుల ఎదురుచూపులు:
దీనిలో భాగంగా ఈ వారం ఏయే సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఒకసారి చూస్తే: నవంబర్ 24 నుంచి ఐదు సినిమాలు క్యూలో వున్నాయి. వీటన్నింటిలోకీ ఒకే ఒక్క సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. అదే కన్నడ సంచలనం కాంతారా. అతి తక్కువ బడ్జెట్‌తో రిలీజైన ఈ సినిమా సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సత్తాను మరోసారి చాటింది. అన్ని భాషల్లో కలిపి 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందా అని ఆ సెక్షన్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సస్పెన్స్‌కు చెక్ పడింది. అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 24న కాంతారా దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
ప్రిన్స్ ఓటీటీలో ఆకట్టుకుంటుందా :
కాంతారా తర్వాత జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తీకేయన్ హీరోగా తెరకెక్కిన ప్రిన్స్‌ను నవంబర్ 25 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక హీరో నానికి చెందిన వాల్ పోస్టర్ ప్రోడక్షన్స్‌లో తెరకెక్కిన ‘‘మీట్ క్యూట్’’ అదే రోజున సోనీ లీవ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి నాని సోదరి దీప్తి దర్శకత్వం వహించారు.
నెట్‌ఫ్లిక్స్‌లో క్రైమ్ థ్రిల్లర్స్ :
ఇకపోతే.. డబ్బింగ్ సినిమాలు కూడా అదే రోజున సందడి చేయనున్నాయి. సీతారామం హిట్‌తో మంచి జోష్‌లో వున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటించిన ‘‘చుప్’’ సినిమా జీ 5లో స్ట్రీమింగ్ కానున్నాయి. దీని తర్వాత తమిళ చిత్రం ‘‘పడవెట్టు’’ నవంబర్ 25న నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఖాకీ అనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కూడా అదే రోజున నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com