వచ్చే వారం లిస్ట్ పెద్దదే
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ మధ్య కాలంలో ప్రతి వారం కనీసం రెండు సినిమాలైనా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ వారం కూడా నాగచైతన్య నటించిన యుద్ధం శరణం, అల్లరి నరేష్ నటించిన మేడమీద అబ్బాయి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే.. వచ్చే వారం (సెప్టెంబర్ 15) మాత్రం లిస్ట్ కాస్త పెద్దదిగానే కనిపిస్తోంది. ఓ అరడజను తెలుగు సినిమాలతో పాటు ఓ తమిళ డబ్బింగ్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ లిస్ట్‌లో ఉన్న సినిమాల గురించి మాట్లాడుకుంటే.. ఈ వారం రావాల్సిన సచిన్ జోషి వీడెవడుతో పాటు సునీల్ ఉంగరాల రాంబాబు, నారా రోహిత్ కథలో రాజకుమారి, సందీప్ కిషన్ ప్రాజెక్ట్ z , కొత్త వాళ్లతో రూపొందిన ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం, ఓయ్ నిన్నే విడుదలకు సిద్ధమయ్యాయి. అలాగే మేలో రావాల్సిన తమిళ డబ్బింగ్ చిత్రం సరసుడు (శింబు, నయనతార) కూడా ఈ లిస్ట్‌లో ఉంది. మరి వీటిలో ఏ సినిమా విజయం సాధిస్తుందో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments