ఈసారి శర్వానంద్‌తో...
Send us your feedback to audioarticles@vaarta.com
అర్జున్ రెడ్డి విడుదల తర్వాత దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాకు క్రేజ్ పెరిగింది. చాలా మంది హీరోలు, నిర్మాతలు ఈ దర్శకుడితో సినిమా చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ దర్శకుడు మాత్రం చాలా పర్టికులర్‌గానే సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడట. ప్రస్తుతం ఫిలింనగర్‌లో వినడపడుతున్న వార్తల ప్రకారం ఈ దర్శకుడు, హీరో శర్వానంద్‌తో సినిమా చేయబోతున్నాడు.
ఇద్దరూ కలిసి కథ డిస్కస్ చేశారని, ఇప్పుడు కథ సిద్ధం అవుతుందట. త్వరలోనే సినిమా సెట్స్‌లోకి వెళ్లనుంది. చుట్టాలబ్బాయి నిర్మాత రామ్ తాళ్ళూరి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. శతమానం భవతి సినిమా తర్వాత శర్వానంద్ ఈ నెల 29న మహానుభావుడు సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమా తర్వాతే శర్వానంద్, సందీప్ రెడ్డి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments