ఈసారి కూడా ట్రంపే గెలుస్తారట...
Send us your feedback to audioarticles@vaarta.com
నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సమయం పెద్దగా లేదు. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేదే ఆసక్తికర విషయం. అమెరికా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు ఒకవైపు రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోవైపు డెమొక్రటిక్ అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నారు. దీంతో ప్రపంచమంతా అమెరికా వైపే చూస్తోంది. ఎవరు గెలుస్తారనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఈ సారి కూడా అమెరికా అధ్యక్ష పీఠాన్ని ట్రంపే దక్కించుకోతున్నారని ఓ జ్యోతిష్కుడు వెల్లడించారు. అయితే ఆ జ్యోతిష్కుడు ఎవరో కాదు.. భారత్‌కు చెందిన శంకర్ చరణ్ త్రిపాఠి.
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై స్పందించిన శంకర్ చరణ్ త్రిపాఠి.. ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థుల గ్రహాల స్థితిగతులు, జన్మించిన ప్రదేశం, పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తారని అంచనా వేశారు. ఎన్ని ఓట్ల తేడాతో ట్రంప్ విజయం సాధిస్తారనేది కూడా శంకర్ చరణ్ వెల్లడించారు. నాలుగు నుంచి తొమ్మిది లక్షల ఓట్ల తేడాతో ట్రంప్ విజయం సాధిస్తారని తెలిపారు. ట్రంప్ విజయానికి కారణం కేవలం నాలుగు రాష్ట్రాలేనని ఆయన వెల్లడించారు. జో బైడెన్ తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నప్పటికీ ఆయనకు ఓటమి తప్పదని శంకర్ చరణ్ స్పష్టం చేశారు. అయితే ట్రంప్ విజయం సాధించినప్పటికీ విమర్శల పాలవుతారని ఆయన వెల్లడించారు.
ఇంతకీ శంకర్ చరణ్ భారత్‌కు చెందిన జ్యోతిష్కుడు మాత్రమే కాదు.. ఆర్జేడీ మాజీ నేత కూడా. గతంలో ఆర్జేడీ అధికార ప్రతినిధిగా శంకర్ చరణ్ త్రిపాఠి పని చేశారు. 2018లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల పార్టీ నుంచి ఆయనను తొలగించారు. గతంలో రాజకీయాల్లో లాలూ ప్రసాద్ యాదవ్‌కు మంచి సలహాదారుగా ఉండేవారు. కాగా.. 40 ఏళ్లుగా గెలుపోటములను కచ్చితంగా అంచనా వేస్తున్న అమెరికా ప్రొఫెసర్ అలన్ లిచ్ట్మాన్ మాత్రం గెలుపు జో బైడెన్‌దేనని కొన్ని నెలల క్రితమే స్పష్టం చేశారు. మరి ఎవరి మాటలు నిజమవుతాయో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout