ఈసారి మరింత యూత్‌గా..!
Send us your feedback to audioarticles@vaarta.com
సుకుమార్ దర్శకత్వం వహించే చిత్రాలకు, ఆయన కథలందించే సినిమాలకు తేడా స్పష్టంగా ఉంటుంది. ఎంతగా ఉంటుందంటే ఆయన కథ అందించిన కుమారి21ఎఫ్ చూసిన వారికి ఇట్టే అర్థమవుతుంది. ఆ సినిమాను తీసిన దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్. ప్రస్తుతం మరో సినిమా తీయనున్నారు. తాజా చిత్రంలో నితిన్ హీరో. ఈ సినిమాకు కూడా కథను సుకుమారే అందించారట.
కుమారి 21ఎఫ్ కన్నా ఈసినిమా మరింత యూత్‌ఫుల్‌గా, మరిన్ని కమర్షియల్ వేల్యూస్‌తో ఉంటుందట. జీఏ2తో కలిసి సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను నిర్మించనుంది. బన్నీవాసు నిర్మాత. గతంలో బన్నీవాసు నిర్మాతగా సుకుమార్ `100 పర్సెంట్ లవ్` సినిమాలో నటించారు. నితిన్ సరసన ఎవరు నటిస్తారనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దాని తర్వాతే సుకు కథ అందించిన ఈ ప్రాజెక్ట్ మొదలవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments