ఈ సక్సెస్ నాకు బోనస్ అవుతుంది - కార్తికేయ
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ నవంబర్ 17న దాదాపు తొమ్మిది చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. వాటిలో `ప్రేమతో మీ కార్తీక్` సినిమా కూడా విడుదలవుతుంది. కార్తికేయ, సిమ్రత్ జంటగా నటించారు. రిషి దర్శకుడు. రవీందర్ర ఆర్.గుమ్మకొండ నిర్మాత. ఈ సినిమా విడుదల సందర్భంగా కథానాయకుడు కార్తీకేయ మీడియాతో సినిమా గురించి మాట్లాడుతూ - ``నాకు చిన్నప్పట్నుంచి హీరో కావాలనే కోరిక బలంగా ఉండేది. బి.టెక్ చదివే రోజుల్లో నేను పోర్ట్ ఫోలియో తయారు చేసుకుని అవకాశాల కోసం తిరిగేవాడిని.
తరుణంలో నిర్మాతైన మా బాబాయ్ నన్ను పిలిచి..రిషిగారిని వెళ్లి కలవమని అన్నారు. నేను ఆయన్ను కలిశాను. ఆయన స్క్రిప్ట్ వినిపించారు. నాకు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. అంతా ఓకే అనుకున్న తర్వాత సినిమా ప్రారంభం అయ్యింది. యు.ఎస్‌లో పుట్టి పెరిగిన కార్తీక్ అనే అబ్బాయి ఏ ఎమోషన్స్ లేకుండా పెరిగి పెద్దవుతాడు. ఎప్పుడు తన గురించి, తన వ్యాపారం గురించి ఆలోచిస్తుంటాడు కార్తీక్. ఒక అనుకోని ఘటనతో..కార్తీక్ ఇండియాకు వచ్చేస్తాడు. అక్కడ అతనికి ఓ ప్రియురాలు, ప్రేమ, స్నేహితులు ఇలా అందరూ దగ్గరవుతారు. ఇలా కార్తీక్ జీవిత ప్రయాణమే ఈ చిత్రం. గొల్లపూడి మారుతీరావుగారితో నాకు కాంబినేషన్ సీన్స్ లేవు కానీ, ఆయున షూటింగ్ చేసిన సవుయంలో..సెట్స్‌లో గడిపాను. ఆయనలాంటి నటుడు మా సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాం. మంచి ఎమోషనల్ సబ్జెక్ట్‌ను చక్కగా హ్యాండిల్ చేశారు. నటన పరంగా ఎక్కగా కాంప్రైమెజ్ కాలేదు. ఆయునకు కావాల్సిన అవుట్‌పుట్‌ను రాబట్టుకున్నారు. గొల్లపూడి తర్వాత మురళీశర్మగారితో కూడా నటించడం ఆనందంగా ఉంది. సీనియర్ నటులతో చేయడం వల్ల నా నటన పరంగా మరింత అనుభవం వచ్చినట్లయ్యింది. షాన్ రెహమాన్‌గారు మలయాళంలో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్..ఆయన తన మ్యూజిక్, రీరికార్డింగ్‌తో సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లారు. ఈ సినిమా అనుభవాన్ని నేను మరచిపోలేను. అలాగే సినిమా సక్సెస్ నాకు పెద్ద బోనస్ అవుతుంది. సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్మకంగా ఉన్నాను`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout