రావ‌ణుడి పాత్ర‌కు ఆ స్టార్ ఓకే అంటాడా?

  • IndiaGlitz, [Friday,August 21 2020]

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగారు. ఇప్పుడు ప్ర‌భాస్ చేస్తున్న మూడు సినిమాలు ప్యాన్ ఇండియా సినిమాలే కావ‌డం విశేషం. రాధేశ్యామ్ చిత్రీక‌ర‌ణ‌లో ఉండ‌గా నాగ్ అశ్విన్ సినిమా సెట్స్‌పై ఉంది. ఈ సినిమాలో దీపికా ప‌దుకొనె హీరోయిన్‌గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌భాస్ తాజా చిత్రం ఓంరావుత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రానికి ఆదిపురుష్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేసి అనౌన్స్ చేశారు. ఇది రామాయ‌ణం అని.. రాముడిగా ప్ర‌భాస్ న‌టిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఒక‌వేళ నిజంగా ప్ర‌భాస్ ఆదిపురుష్ రామాయ‌ణ‌మే అయితే మ‌రి సీత‌గా ఎవ‌రు న‌టిస్తారు? రావ‌ణాసురుడుగా ఎవ‌రు న‌టిస్తార‌నే వార్త‌లు సినీ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడే ఈ సినిమా గురించి మాట్లాడ‌టం తొంద‌పాటే అయినా.. సినిమాలో న‌టించ‌బోయే తారాగ‌ణం గురించి వార్త‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి.

లేటెస్ట్ సోష‌ల్ మీడియా వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ప్ర‌భాస్ ఆదిపురుష్‌లో బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీఖాన్ రావ‌ణాసురుడుగా న‌టిస్తార‌ట‌. ఓం రావుత్ గ‌త చిత్రం తానాజీలో సైఫ్ ఆలీఖాన్ విల‌న్ పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అదే విధంగా మ‌రోసారి ఓం రావుత్ కోర‌డంతో రావ‌ణాసురుడుగా న‌టించ‌డానికి సైఫ్ ఒప్పుకున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల్లో నిజా నిజాలు తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

More News

ఎస్పీ బాలు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఎంజీఎం

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యంగా తిరిగి రావాలని దేశం మొత్తం కాక్షింస్తోంది. కరోనాతో పోరాడుతున్న ఆయన ఆరోగ్యంలో మార్పేమీ లేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

ఆగ‌స్ట్ 26 నుంచి కెజిఎఫ్‌2 బ్యాలెన్స్‌ షూటింగ్ ప్రారంభం

రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా.. కైకాల స‌త్య‌నారాయ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో

ఏపీలో కొత్తగా 9544 కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ మరణాలు సైతం వందకు చేరువలో నమోదవుతూ ప్రజానీకాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి.

బియర్ గ్రిల్స్‌.. ఇప్పుడు అక్ష‌య్ వంతు

డిస్క‌వ‌రీ ఛానెల్‌ను చాలా మంది ప్రేక్ష‌కులు ఇష్ట‌ప‌డి చూస్తుంటారు.

సీఐడీ విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశం...

శ్రీశైలం పవర్ ప్లాంటు ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీఐడీ విచారణకు ఆదేశించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను తక్షణమే వెలికి తీయాలని..